Saturday, February 24, 2024
Homeసాహిత్యంసమాజాన్ని మార్చగలిగే శక్తి సాహిత్యానికుంది

సమాజాన్ని మార్చగలిగే శక్తి సాహిత్యానికుంది

  • వైభవంగా అక్షరాల తోవ 6వ వార్షికోత్సవం
  • వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
  • కథలు, కవితల విజేతలకు పురస్కారాలు

ఖమ్మం, జనవరి 28 (జనవిజయం) : సమాజాన్ని మార్చగలిచే శక్తి సాహిత్యానికుందని ప్రముఖ సాహితీ సంస్థ “అక్షరాల తోవ” 6వ వార్షికోత్సవ సభలో పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం ‘అక్షరాల తోవ సాహిత్య సంస్థ’ 6వ వార్షికోత్సవ సభ నామా పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. తొలుత అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన కథలు, కవితలతో ప్రచురించిన వార్షికోత్సవ సంచికను ప్రముఖ కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు, పి.ఆర్‌.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు (వై.వి) ఆవిష్కరించారు. అనంతరం మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ… కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని అన్నారు. నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలను సాహిత్యం ద్వారా వివరిస్తూ అందరినీ చైతన్యపరచాలన్నారు. ఆరేళ్లుగా సాహిత్యంలో విశేషకృషి గావిస్తున్న అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్‌ను అభినందించారు. మరో అతిథి యలమద్ది వెంకటేశ్వర్లు (వైవి) మాట్లాడుతూ… తనకు సాహిత్యంలో ప్రవేశం లేదని, అభిరుచి ఉందని, సాహిత్యాన్ని ప్రోత్సహించే వారంటే ఇష్టమని, అందుకు తాను ఇతోధికంగా సాయం చేస్తుంటానని అన్నారు. అనంతరం ‘కథా’ విజేతలు బి.కళాగోపాల్ (నిజామాబాద్), బివి శివప్రసాద్ (విజయవాడ), పొత్తూరి సీతారామరాజు (కాకినాడ) అక్షరాలతోవ పురస్కారంతో పాటు నగదు బహుమతులను అందచేశారు. కంచర్ల శ్రీనివాస్(ఖమ్మం)కు ప్రోత్సాహక బహుమతిని అందచేశారు. ‘కవితా’ విజేతలను సన్మానించారు. వార్షికోత్సవం సందర్భంగా మొగిలి గుణకర హాస్యవల్లరి, పాగి వెంకన్న, మూసా పాడిన పాటలు సభికులను ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి, వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వురిమళ్ల సునంద, ప్రముఖ కవులు రౌతు రవి, లెనిన్ శ్రీనివాస్, కవులు సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, కొమ్మవరపు కృష్ణయ్య, మేడగాని శేషగిరి, గద్దపాటి శ్రీనివాస్, షుకూర్, తోట సుభాషిణి, ఇబ్రహీం నిర్గుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments