జనవిజయంతెలంగాణపత్తి, కంది పంటలకు అధిక ప్రాధాన్యం

పత్తి, కంది పంటలకు అధిక ప్రాధాన్యం

సర్వం సిద్దం చేసుకుంటున్న రైతాంగం

ఆదిలాబాద్‌,మే19(జనవిజయం): జిల్లాలోని రైతు పత్తి, కంది, వరి పంటలపై కోటి ఆశలతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో పత్తి సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నది. దీంతో రైతులు దుక్కును దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. తొలకరి జల్లు పడగానే విత్తుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశించనుండడంతో ఖరీఫ్‌ సీజన్‌కు రైతులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు రైతులు తమ పొలాల్లోకి సేంద్రియ ఎరువులను తరలిస్తున్నారు. జిల్లాలో పంట సాగుకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించి సిద్ధం చేస్తున్నారు. సాగు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పత్తి, వరి, కంది సాగు భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన ఎరువులు వినియోగముంటుందనే ప్రతిపాదనల మేరకు జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. వానాకాలం సీజన్‌లో అక్టోబరు వరకు ఎరువులు అవసరమైన నిల్వలను ఏ నెలలో ఎంతమేర అవసరమో అంత స్థాయిలో బఫర్‌ స్టాక్‌ అందుబాటులో ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఎంతమేరకు ఎరువు అవసరమో వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతుల నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల రశీదులు పొంది రైతులు భద్రపరుచుకోవాలి. పంట సాగులో అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఇలా జిల్లాలో వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల చివరి వారంలోనే తొలకరి పలకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో యేటా పత్తి పంట వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్‌లో రైతుల అవసరాల మేరకు విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి