జనవిజయంఆంధ్రప్రదేశ్సాగుకు అండగా లేని జగన్ ప్రభుత్వం - లెఫ్ట్ విమర్శలు

సాగుకు అండగా లేని జగన్ ప్రభుత్వం – లెఫ్ట్ విమర్శలు

  • సాగు రైతులకు అండగా లేరి పథకాలు
  • బడ్జెట్ కేటాయింపులు గారడీగా లెఫ్ట్ విమర్శలు
  • ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు డీలా

అమరావతి,మే26(జనవిజయం): నిరుడు, ఈయేడు కరోనా లాక్ డౌన్లు, ఆంక్షల వలన రబీ పంటల మార్కెటింగ్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వరి ధాన్యం సహా పలు పంటలను రైతుల నుండి కొనే నాధుడే లేడు. ఉల్లి, టమాటా, పసుపు, పత్తి, అరటి, మామిడి, బత్తాయి వంటి పంటల ధరల్లో స్థిరత్వం లేదు. ఇలాంటప్పుడు పంటల కొనుగోలుకు అధిక నిధులు సమకూర్చి ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు నష్టం లేకుండా ఆదుకోవాలి. కానీ ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్ల నుండి రూ.500 కోట్లకు కుదించడం ఎవరికి లాభం? అన్న ప్రశ్నలు ఉన్నాయి. రాష్ట్రంలో 92 శాతం రైతులు రుణగ్రస్తులని నేషనల్ శాంపిల్ సర్వే తేల్చగా, నున్నా వడ్డీ పథకానికి రూ.1,100 కోట్ల నుండి 500 కోట్లకు నిధులు తగ్గించారు. రైతులు సబ్సిడీ విత్తనం అడుగుతుండగా అందుకు నిధులను 192 కోట్ల నుండి వంద కోట్లకు కోత పెట్టారు. అరకొర రైతు భరోసా సాయం అందిందని అంటున్నారు. అలాగే రైతుభరోసా కేంద్రాలు రైతుల సమస్త సమస్యలకూ మందు అనడం రైతులను తప్పుదారి పట్టించడమే అన్న విమర్శలు ఉన్నాయి.

రైతులంతా వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో రాష్ట్రంలో వేగంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోందని లెఫ్ట్ పార్టీల నేతలు దుయ్యబుడుతున్నారు. సాగుపై ప్రత్యేక పాలసీ, భారీ యాంత్రీకరణ, గ్రామాల్లో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, ఉపాధి హామీ అనుసంధానం, సహకార సంస్కరణలకు సై అంది. రైతులు తమకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తక్కువ వడ్డీపై బ్యాంక్ పరపతి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అడుగుతుండగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శిస్తున్నారు.. 70 శాతం భూమిని సాగు చేస్తున్న లక్షలాది కౌలు రైతులకు ఊతం ఇవ్వాల్సిన సర్కారు, వారికి ఇంతకు ముందు పరిమితంగానైనా ఉన్న చట్టబద్ధ హక్కులను కొత్త చట్టం పేరిట తొలగించింది. దాంతో ప్రభుత్వం ఖర్చు చేసే కొద్దిపాటి నిధులూ వాస్తవ సాగుదార్లకు దక్కట్లేదు.

కోవిడ్ మహమ్మారి, వంటి ఉపద్రవాలు తోడై సాగు రంగం పైనా, రైతుల పైనా దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో ప్రభుత్వం రైతుల వైపు నికరంగా నిలబడి ఇతోధికంగా నిధులు వెచ్చించాలి. ఇటీవలి బడ్జెట్ లో ప్రభుత్వ ప్రతిపాదనలు నిరాశా నిస్పృహల్లో ఉన్న అన్నదాతల్లో ఆత్మ విశ్వాసం నింపే విధంగా లేవని అంటున్నారు. వచ్చే నాలుగేళ్ల కాలానికి ఉచితంగా బోర్లు వేసేందుకు ఖర్చు చేయబోయే మొత్తాన్ని ఖర్చు చేసినట్లు చూపించారు. ప్రాజెక్టుల కింద నికర సాగు రెండేళ్లలో ఏ మాత్రం పెరగలేదు. ఆహారోత్పత్తుల దిగుబడులు ముందటేడు కంటే నిరుడు ఏడు లక్షల టన్నులు తగ్గాయని పేర్కొని సాగును పండగ చేశామన్న సర్కారు ప్రచారానికి సర్వే చెంపపెట్టయింది. సాగు సంక్షోభం ఇంకా తీవ్రమవుతుందని అంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి