Saturday, February 24, 2024
Homeరాజకీయంసాగర్‌ జలాలతో చెరువులు కుంటలు నింపాలి

సాగర్‌ జలాలతో చెరువులు కుంటలు నింపాలి

  • ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలి
  • తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఇరిగేషన్‌ అధికారులకు వినతి

ఖమ్మం, ఫిబ్రవరి 10: జిల్లాలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులు కుంటలు అలాగే ఆరుదడు పంటలకు సాగును అందించేందుకు సాగర్‌ జలాలు వెంటనే విడుదల చేయాలని శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ ధనుకూమార్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్లో సాగు చేసిన మిర్చి, రబీ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలకు సాగునీరు అందించాలి అని అన్నారు, జిల్లాలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో చెరువులు కుంటలు వాగులు వంకలు చెక్‌ డ్యాంలో కూడా నీరు లేక పశువులు కూడా దాహార్తి కి ఇబ్బందులు పడుతున్నాయి అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 518 అడుగులు నీరు నిలువ ఉన్నప్పటికీ సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయకపోవడం రైతులకు తీరని నష్టమవుతుందన్నారు. వెంటనే సాగర్‌ జలాలు విడుదల చేసి పంటలను, పశువులు కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి వర ప్రసాద్‌, జిల్లా కమిటీ సభ్యులు ఊరిడి సుదర్శన్‌ రెడ్డి,కోల్లెటి ఉపేందర్‌,చింతల రమేష్‌ రైతులు సామినేని రామయ్య, నున్నా వీరేష్‌, రామకృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments