జనవిజయంఆంధ్రప్రదేశ్ఆనందయ్య పై ఆర్.జి.వి ట్వీట్ ల గోల!

ఆనందయ్య పై ఆర్.జి.వి ట్వీట్ ల గోల!

  • రక్షణపై ఆర్జీవీ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ
  • 24న కృష్ణపట్నం రానున్న ఐసిఎంఆర్ బృందం
  • మందు తయారీని పరిశీలించిన వెంకటేశ్వరా ఆయుర్వే కాలేజీ
  • కరోనా మందుపై 31న లోకాయుక్త విచారణ

నెల్లూరు, మే 22(జనవిజయం): ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఆయుర్వేద వైద్యుడు అలియాస్ బొడిగె ఆనందయ్య గురించి నినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ‘ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌనీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా’ అంటూ ట్విటర్ లో పేర్కొన్నారు.

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవు తోంది. కార్పొరేట్ శక్తులతో జాగ్రత్తగా ఉండాలని.. ఆయనను అణగదొక్కే అవకాశం ఉందని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆర్జీవీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తోంది. అయితే వివిధ పరీక్షల్లో ఆనందయ్య ఆయుర్వేద మందుపై సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆనందయ్యకి పూర్తి స్థాయిలో పోలీసు రక్షణ కల్పించారు. ఈ నెల 31న కొవిడ్ ఆయుర్వేద మందుపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు హాజరుకావాలని నెల్లూరు జిల్లా అధికారులకు లోకాయుక్త ఆదేశాలిచ్చింది. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించకూడదని లోకాయుక్త పేర్కొంది. మరోవైపు ఆనందయ్య నుంచి ఆయుష్ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని ఆయుష్ అధికారులకి ఆనందయ్య వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఆయుష్ ఆధికారులు ఇచ్చిన రిపోర్టుల్లో ఈ మందులో వినియోగించే పదార్థాల వల్ల ఎలాంటి హాని జరగదని, మందు తయారీ కూడా ప్రమాణాలకు లోబడే ఉందని పేర్కొన్నారు. చివరిగా మందు తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఆ వెనువెంటనే మందు పంపిణీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. ఇకపోతే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర అయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి