ఘనంగా సమాచార హక్కు వికాస సమితి ఏడవ వార్షికోత్సవం
ఖమ్మం 28 ఆగస్ట్( జనవిజయం): ఆగస్ట్ 28 న సమాచార హక్కు వికాస సమితి ఏడవ వార్షికోత్సవ దినాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు వికాస సమితి ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు రెంటాలా నారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు .. ఖమ్మం బి.యస్.ఎన్. ఎల్. కార్యాయంలో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రెంటాలా నారాయణ మాట్లాడుతూ., ఆర్.టి.ఐ యాక్ట్ 2005 సామాన్యుడి చేతిలో ఆయుధం అని అభివర్ణించారు. సామాన్యుడు న్యాయం కోసం మా సమాచార వికాస సమితి తలుపులు తడితే అతని తరుపున చట్ట పరమైన పోరాటానికి ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్ చేసి , మిఠాయిలు , స్నాక్స్ పంచిపెట్టారు.
ఈ సమావేశం అనంతరం 76 వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ చే ఉత్తమ సేవా అవార్డు పొందిన ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆపుత్రిలో పిల్లల ప్రత్యేక వైద్యనిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ టి. పవన్ కుమార్,ఎం.డి. ని సమాచార హక్కు వికాస సమితి జిల్లా కమిటీ సభ్యులు.. డాక్టర్ ఉత్తమ సేవలను , వారి సేవా నిరతిని కొనియాడుతూ సాదరంగా శాలువాతో , పూలమాలతో వారి ఇంటి వద్ద సన్మానించారు.