Tuesday, October 3, 2023
HomeUncategorizedరాజ్యాధికారం ద్వారానే ఎస్సీ ఉపకులాలకు న్యాయం...బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్...

రాజ్యాధికారం ద్వారానే ఎస్సీ ఉపకులాలకు న్యాయం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్…

ఎన్నికల్లో ప్రలోబాలకు ఓట్లు అమ్ముకోవద్దు

 

రాజ్యాధికారం ద్వారానే ఎస్సీ ఉపకులాలకు న్యాయం...బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్…

ఎన్నికల్లో ప్రలోబాలకు ఓట్లు అమ్ముకోవద్దు

 జనవిజయం,29 మే(హైదరాబాద్): దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరగాలంటే బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో దళిత బంధు కోసం  57 ఎస్సీ ఉపకులాల ఐక్యంగా నిర్వహించిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఎస్సీల్లోని ఉపకులాలైన మోచీ, హోలియదాసరి,బైండ్ల, చిందోల్లు, మష్టిన్,గోసంగి,డక్కలి నేటికీ బిక్షాటన చేస్తూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నో ఏండ్లుగా దళితులకు అందించే ప్రభుత్వ పథకాలు కూడా ఉపకులాలకు దక్కడం లేదన్నారు. ఎస్సీ ఉపకులాల ప్రజలు చెప్పులరిగేలా కలెక్టర్,ఆర్డీవో కార్యాలయాలు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా కులం సర్టిఫికెట్​ జారీ చేయడం లేదన్నారు.తక్షణమే ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని కేసీఆర్ రూ.1,200 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టుకొన్నాడు కానీ, ఒక్కరోజు కూడా సెక్రటేరియేట్ ముఖం చూడరని ఏద్దేవా చేశారు.ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆయన కేసీఆర్ బినామీ కంపెనీలకు లాభం చేకుర్చేందుకు 111 జివో రద్దు చేశారని ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పేదల అసైండ్ భూమిని గుంజుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే,ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు  ఓట్లు అమ్ముకోవద్దన్న ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడే పార్టీలు గెలిపించాలని కోరారు.

     ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల  రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జహంగీర్, బాణాల మంగేష్, బీఎస్పీ అధికార ప్రతినిధి కే.అరుణ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చాట్ల.చిరంజీవి,షఫీ తదితరులు పాల్గొన్నారు.

 

కేసీఆర్ కు ముస్లింల సంక్షేమం పట్టదు

బీఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మౌలానా ఖైరుద్దీన్ సూఫీని బర్కత్ పురలోని శాలిని ఆసుపత్రిలో సోమవారం పరామర్శించారు. కేసీఆర్ కు ముస్లిం ఓట్లు కావాలె తప్ప, సంక్షేమం పట్టదని విమర్శించారు.గత 15 ఏళ్లుగా  హజ్  యాత్రికుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన బిల్డింగ్ పనుల పరిశీలనకు వెళ్లిన ముస్లిం పెద్దలు అస్వస్థకు గురయ్యారని గుర్తుచేశారు. బిల్డింగ్ సెల్లార్ లో ఎన్నో ఏళ్ళుగా నిల్వ ఉండి,నీటిలో విషపూరిత క్రిములు చేరడం వల్లె, హజ్ హౌజ్ ను సందర్శించిన ముస్లిం నాయకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని విమర్శించారు. ఆయన వెంట మైనారిటీ రాష్ట్ర నాయకులు అబ్రాహార్, షఫీ, అరుణ, చిరంజీవి తదితరులు ఉన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments