వార్డెన్లు అప్పులు చేసి పిల్లలకు తిండి పెడుతున్నారు
..BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు RSP….
హైదరాబాద్, ఏప్రిల్ 21(జనవిజయం)
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు హైదరాబాదులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘నిన్న ఎస్ సి మరియు ఎస్ టి సంక్షేమ హాస్టళ్ల వార్డెన్‌లు చాలా మంది నన్ను కలిసిండ్రు. గత ఆరు నెలల నుండి వాళ్లకు డైట్(పిల్లల ఆహారానికి) బిల్లులు రాలేదంట. వార్డెన్లు అప్పులు చేసి పిల్లలకు తిండి పెడుతున్నారంటే తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో చూడండి. పై అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నరట! ముఖ్యమంత్రి కేవలం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ప్రచారం చేసుకుంటేనే సరిపోదు సారూ, పేద పిల్లలు ఆయన లాగా తయారు కావడానికి కావలసిన చదువు, వసతులు కూడా ఇవ్వండి.’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.