జనవిజయంఆంధ్రప్రదేశ్రఘురామకృష్ణంరాజు చికిత్సను వీడియోగ్రఫీ చేసి సమర్పించాలని సుప్రీం ఆదేశాలు

రఘురామకృష్ణంరాజు చికిత్సను వీడియోగ్రఫీ చేసి సమర్పించాలని సుప్రీం ఆదేశాలు

రఘురామకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స

న్యూఢల్లీ,మే17(జనవిజయం): ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్‌ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్‌ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్‌ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణంరాజును వెంటనే సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ వినీత్‌ సరన్‌, జస్టిస్‌ బి. ఆర్‌. గవాయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడ్డాయి. అయితే రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే తెలిపారు. సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షకు సిద్ధమని పేర్కొన్నారు. సవిూపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.విూ. దూరంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.విూ దూరంలో ఉందని లాయర్‌ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్‌ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్‌ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలు శుక్రవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. తరవాత వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి