జనవిజయంఆంధ్రప్రదేశ్రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ను సమర్థిస్తున్నాం - మంత్రి అనిత

రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ను సమర్థిస్తున్నాం – మంత్రి అనిత

ఏలూరు, మే 16 (జనవిజయం): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ను తామంతా సమర్థిస్తున్నట్లు మంత్రి వనిత పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ పెట్టిన భిక్ష అని అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి దయతో, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సరైన భాష, వ్యవహరం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన సహజ లక్షణమని, అయితే రాఘురామకు అందులో ఒక్కటీ కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదని మంత్రి విమర్శించారు. ప్రజా సంక్షేమం వదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయ‌డం స‌మంజ‌స‌మ‌న్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలని తానేటి వ‌నిత‌ హితవు పలికారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి