జనవిజయంఆరోగ్యంR.O. నీళ్ళు త్రాగుతున్నారా?... వెంటనే ఆపేయండి - శ్రీధర్ నల్లమోతు

R.O. నీళ్ళు త్రాగుతున్నారా?… వెంటనే ఆపేయండి – శ్రీధర్ నల్లమోతు

నీరు కొండల్లో పుట్టి నదులగుండా ప్రవహించి సముద్రానికి చేరేలోపు, రిజర్వాయర్లు, నీటి చెరువులు వంటి చోట్ల కూడా నిల్వ చేయబడుతుంది. వివిధ ప్రదేశాలగుండా ప్రవహించే క్రమంలో అది మట్టిలోని మినరల్స్ ని, కొన్ని రకాల వాయువులను, కొన్ని సూక్ష్మ క్రిములనూ కలిగివుంటుంది.

మనం తాగే నీరు ఆరోగ్యానికి మేలు చేసేలా వుండడం కోసం ప్రతీదేశం నీళ్ళలో ఎంతవరకూ ఈ మినరల్స్, ఇతర అంశాలు వుండాలి అన్నది ప్రమాణం వుంటుంది. అది ఒక్కో దేశానికి ఒక్కోలా వుంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, ఇతర అనేక అంశాలను బట్టి ఈ ప్రమాణాలు వుంటాయి. వాస్తవానికి నీటిద్వారా శరీరానికి అవసరం అయిన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక మినరల్స్ లభిస్తాయి.

వీటిని నాశనం చేసేవే R.O.

R.O. వాటర్ ప్యూరిఫైయర్లు వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ లో ఎక్కువగా వాడతారు. వత్తిడికి గురిచేయబడిన వాటర్ సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా చర్యకి గురై, నీళ్ళలో వుండే సూక్ష్మ క్రిములను చంపడంతో పాటు, కాలుష్యాలను తొలగిస్తాయి. అంతవరకూ బానేవుంది. కానీ అదేక్రమంలో శరీరానికి అత్యంత అవసరమైన మినరల్ ఐయాన్స్ ని కూడా ఈ R.O. నాశనం చేస్తుంది.

దాంతో ఈ R.O. వాటర్ తాగిన వారి శరీరానికి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ధాతువులు అందవు. వాస్తవానికి R.O. వాటర్ వినియోగం కేవలం లాబొరేటరీలు, ఇండస్ట్రీ అవసరాలకే పరిమితం చెయ్యబడింది. అయితే నీళ్ళ కాలుష్యం పెరిగాక ఆ పేరు చెప్పి ప్రజలను మభ్యపుచ్చి బిజినెస్ చేసుకోవడానికి R.O. టెక్నాలజీ సామాన్యుల ఆరోగ్యం దెబ్బతీయడానికి వాడుకంలోకి తీసుకురాబడింది.

చాలామంది మంచి పోషకాహారం తినాలని, ఇమ్యూనిటీ పెంచుకోవాలనీ ఖర్చుపెట్టి మరీ మంచి ఫుడ్ తీసుకుంటారు. కానీ ఆహారంలో పోషక విలువలను శరీరంలోని ప్రతీ కణానికీ అందేలా చేసే పని నీళ్ళది. ఈ నీళ్ళు మినరల్స్ ని కలిగి లేకపోవడం వల్ల తిన్న తిండి వంటబట్టకపోవడం, అజీర్ణం, గ్యాస్, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. 150 నుండి 300 మధ్య TDS వున్న నీళ్ళని తాగాలి. కానీ ఈ R.O. వాటర్ ప్యూరిఫైయర్లు మీరు టెస్ట్ చేస్తే 50-100 TDS కి మించి వుండవు. అంటే అందులో మినరల్స్ అస్సలు వుండవు. కొన్ని లేటెస్ట్ మోడల్స్ లో “మినరల్ గార్డ్”, TDS Control వంటి కొన్ని ఫీచర్లతో మినరల్ లెవల్ సెట్ చేసుకునే ప్రక్రియ వున్నా అది సాంకేతికంగా అదనంగా మినరల్స్ జతచేసేలా వినడానికి బానే వుంది గానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మెషీన్లు వాడిన వారికి కొత్తగా ఎలాంటి ప్రయోజనం లేదు. వారి ఆరోగ్యం క్షీణిస్తూనే వుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.

మరి ఎలాంటి నీరు తాగాలి?

300 TDS లోపల వున్న నీరు మీ కుళాయి ద్వారా వస్తుంటే అది కేవలం ఇమ్-ప్యురిటీస్ ఫిల్టర్ చేసే బేసిక్ ఫిల్టర్లని వాడి, లేదా నీళ్ళని వేడిచేసి వడగట్టి నిక్షేపంగా తాగవచ్చు. అస్సలు క్యాన్ వాటర్ తాగకండి. అవికూడా పైన చెప్పిన సమస్యలు కలిగివుంటాయి. మీకు బోర్ వాటర్ మాత్మఏ వస్తుంటే TDS 300 లోపు వుంటే ఇబ్బందిలేదు. అంతకన్నా ఎక్కువ వుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మినరల్ వాటర్ క్యాన్లు తీసుకుని అందులో మినరల్స్ సాచెట్స్ కలుపుకుని తాగుతూ వుండాలి.

కంగన్ వాటర్ మంచిదా?

ఆల్కలైన్ వాటర్ అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిది. అది చాలా మెరుగైన ph వేల్యూ వుండడంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి వుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల క్యాన్సర్, సోరియాసిస్, డయాబెటిక్, బిపి కంట్రోల్, బ్యాక్ పెయిన్ తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు అధిగమించినవారున్నారు.

ఆల్కలైన్ మెషీన్లు చాలా మార్కెట్లో వున్నాయి. చవకగా వస్తున్నాయని దేన్నిబడితే దాన్ని కొనకండి. అవి నకిలీ పార్టులతో ఎలాంటి ప్రయోజనం కలిగించవు. కంగన్ వాటర్ 2,18,000 బేస్ మోడల్, 2,77,000 స్టాండర్డ్ మోడల్ వుంటాయి. ఖచ్చితంగా ఇది చాలా ఖరీదైనది. బట్ ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ఆరోగ్య స్పృహ వున్నవారు దీన్ని వాడుతుంటారు. కార్లు, ఇతర విలాసాలకు పెట్టే ఖర్చు మన ఆరోగ్యానికి పెట్టకతప్పదు. నేనైతే నా ఆర్థిక స్థోమతకి మించినది అయినా కేవలం నా ఆరోగ్యం కోసం ప్రస్తుతం దీన్ని బుక్ చేశాను. కొన్ని రోజులు వాడాక పూర్తి ఫీడ్ బ్యాక్ తెలియజేస్తాను.

మామూలు వాటర్ వాడొచ్చు కదా!

కంగన్ లాంటివి కొనలేనివారు నిక్షేపంగా టాప్ వాటర్ బాయిల్ చేసుకుని తాగండి. RO మెషీన్లు వాడారంటే మాత్రం మీ ఆరోగ్య సమస్యలు మీరు కొనితెచ్చుకున్నట్లే.

– Sridhar Nallamothu
(ఈ పోస్టు ఒరిజినల్ గా శ్రీధర్ నల్లమోతు టెలిగ్రాం ఛానల్ లో ప్రచురితమైనది)

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి