భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19,(జనవిజయం):
గ్రామాల్లో రైతులు మూడు పంటలు కావాలా లేక మూడు గంటలు విద్యుత్ కావాలా అనే దానిపై చర్చ జరపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం వనమా పేర్కొన్నారు.
సుజాతనగర్ రైతు వేదికలో బుధవారం ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కు నిరసనగా రైతు సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని రాబందుల పాలన కాకుండా రైతులే కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పారు.
సమావేశంలో వనమా రాఘవేందర్ , ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ భూఖ్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, మండల పార్టీ అధ్యక్షులు రెడ్డెం తులసిరెడ్డి, ఎంపీటీసీ మూడు గణేష్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పెద్దమల్ల నరేందర్ ప్రసాద్, శివాలయం గుడి చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.