- ఇళ్ల స్థలాల విషయంలో ప్రధాన నేతలు చేస్తున్న మోసమే రాజీనామాకు కారణం
- ఐ.జె.యూ, హెచ్ 143 లకు రాజీనామాలు చేసిన జర్నలిస్టులు
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ అంటూ ప్రకటన
ఖమ్మం,మార్చి7(జనవిజయం) : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా, ఇళ్ల స్థలాల సాధన లక్ష్యంగా జర్నలిస్టులంతా ఐక్యం కావాలని పలువురు జర్నలిస్టులు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో టీయూడబ్ల్యూజే( ఐజేయు), టీయూడబ్ల్యూజే హెచ్143 యూనియన్లకు చెందిన పలువురు జర్నలిస్టులు ఆయా యూనియన్లకు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా యూనియన్ నాయకులుగా చలామణి అవుతున్న వారు జర్నలిస్టుల జీవితకాల ఇళ్ల స్థలాల సాధన ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొసైటీ పేరుతో ఇంకా మోసం చేస్తూ పాత్రికేయులను ఏమారుస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, అధికారులు, న్యాయస్థానాలు సొసైటీ ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యపడదు అని తేల్చి చెప్పినప్పటికీ నాయకులు అమాయకులైన జర్నలిస్టులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని వివరించారు. అలాంటి వారి పక్కన ఉండి తోటి జర్నలిస్టులకు అన్యాయం చేసే ప్రక్రియలో భాగస్వాములం కాదలుచుకోలేదని తేల్చి చెప్పారు. వారి మోసాలను ఎండగట్టేందుకు యూనియన్లకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం, చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.
రాజీనామా చేసిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఖదీర్ (వి6), దువ్వా సాగర్ (దిశ), కూరాకుల గోపి ( జనం సాక్షి), రాంపూడి నాగేశ్వరరావు(టీవీ 5), మానుకొండ రవికిరణ్( హెచ్ఎంటీవీ ), ఆవుల శ్రీనివాస్ ( సివిఆర్), మారెడ్డి నాగేందర్ రెడ్డి( జర్నలిస్ట్ టీవీ ), జి.యాకేష్ (జీ న్యూస్), కొమెర వెంకటేశ్వర్లు(వి 5), వెగినాటి మాధవరావు( మనమే సాక్ష్యం), ఆర్,అయ్యప్ప (6టీవీ ), ఎం సంజీవరావు( ఆజ్ తక్, ఇండియా టుడే), షేక్ సుభాన్( జనం సాక్షి), దగ్గుపాటి మాధవ్ రావు ( బి ఎన్ బి ), నాయుడు రామకృష్ణ (మహాన్యూస్ ), నలుబోల మధు శ్రీ ( ఆకాష్ జ్యోతి), కిరణ్ (వి 6), కెమెరా మేన్స్, అర్ధద్ ఖాన్ (వి 6), ఫయాజ్ (ఐన్యూస్ ), యూసఫ్( డిడి న్యూస్ ), యకుబ్ పాషా ( మహా న్యూస్ ), గణేష్ ( హెచ్ఎంటీవీ ), శరత్ (జీ న్యూస్ ), సతీష్ (6టీవీ ), జాకిర్ (సీనియర్ వీడియో జర్నలిస్ట్ ), హరిప్రసాద్ ( డిఎన్బి న్యూస్ ), గుత్తికొండ నరేష్( సేన), నూకల రామచంద్ర మూర్తి ( దిశా), పెరుమాళ్ళపల్లి నాగార్జున( దిశా), సయ్యద్ అంజాద్ ( దిశా ), మహమ్మద్ రియాసతుల్లా (మున్షిఫ్), షేక్ జానీ పాషా( రూలింగ్ వన్, డక్కన్ విజన్), రంగా నాగేశ్వరరావు( సివిఆర్ ), ఉపేందర్ (దిశ), అన్సార్ పాషా (స్వేచ్చ), బెల్లంకొండ రాజేంద్రప్రసాద్( ఐ డ్రీమ్) తదితరులు ఉన్నారు.