బోదేబోయిన బుచ్చయ్య కే భద్రాచలం బి.ఆర్.ఎస్ టిక్కెట్ ఇవ్వాలి!
..రేగా కాంతారావు కు విజ్ఞప్తి చేసిన ఏజన్సీ మండల బి.ఆర్.ఎస్. నాయకులు…
భద్రాచలం, 20 ఆగస్ట్(జనవిజయం): భద్రాచలం నియోజకవర్గం లోని దుమ్ముగూడెం, చర్ల , వెంకటాపురం, వాజేడు మండలాల అధ్యక్షు ప్రధాన కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎం.ఎల్.ఏ. మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని క్యాంప్ కార్యాలయంలో కలసి బోదేబోయిన బుచ్చయ్య కే భద్రాచలం బి.ఆర్.ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు