జనవిజయంతెలంగాణరెచ్చిపోతున్న గంగుల - మౌనంగా సాగుతున్న ఈటెల

రెచ్చిపోతున్న గంగుల – మౌనంగా సాగుతున్న ఈటెల

  • ఈటెల వెళ్లడంతో రెట్టించిన ఉత్సాహంలో గంగుల
  • కెసిఆర్ ఆదేశాలతో విమర్శలతో ముందుకు
  • కరోనా విజృంభణ తగ్గే వరకు మౌనంగా ఈటెల
  • పార్టీ మారతాడంటూ ఊహాగానాలు, ప్రచారాలు

కరీంనగర్, మే25(జనవిజయం): కరోనా సెకండ్వేవ్ కారణంగా తెలంగాణ రాజకీయాలు స్తబ్దుగా సాగుతున్నాయి. కరీంనగర్‌కు సంబంధించి ఇప్పుడు గంగుల కమలాకర్ అదేపనిగా మాజీమంత్రి ఈటెల రాజేందర్ లక్ష్యంగా విమర్శలను గుప్పిస్తున్నారు. ఎందుకంటే సిఎం కెసిఆర్ ఆయన ఒక్కరికే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఉన్నారు. అందువల్ల తిట్టడంలో ముందున్నారు. మొన్నటి వరకు తమ సహచర మంత్రిగా ఉన్న ఈటెలపై ఆయన ఇక తనకు తోచిన విధంగా ఎదురుదాడికి దిగుతున్నారు. రోజుకో కార్యక్రమంలో ఈటెల నియోజక వర్గంలో ఇప్పుడు హీటెక్కుతోంది. పైకి గంగుల కనపడుతున్నా ఈటెల వ్యవహారమంతా కేసీయార్ స్వయంగా చూస్తున్నారన్నది విశ్లేషకుల అంచనా. ఈటెలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని హరీష్ రావుని కూడా అస్త్రంగా వాడబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. సర్పంచ్లు, ఎంపిటిసిలు, ఇలా ఒక్కొక్కరితో ప్రకటన చేయించడం, వారితో మాట్లాడించడం, తాము టిఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం షరా మామూలు అయ్యింది. నిజానికి ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అలాగే కొంతకాలం ఇలాగే నడుస్తుంది. ఈటెల రాజేందర్ కూడా కరోనా కష్టాలు ముగిసే వరకు సైలెంట్ గా ఉండాలని చూస్తున్నారు. మరోవైపు ఆయన ఏ పార్టీలో చేరుతాన్నది కూడా చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బిజెపిలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలకు జనాల్లో ఉన్న ఆదరణ ఏపాటిదో తెలిసిందే. మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు..? కాంగ్రెస్ గూటికి చేరుతారా లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా.. అన్న చర్చలు సాగుతున్నాయి. ఇవి రెండూ కాకుండా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా.. అని కూడా కొందరు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆయనతో చర్చించడం, తాజాగా బీజేపీకి చెందిన కీలక నేత కూడా చర్చించారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈటలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఈటల రాజేందరను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారన్న ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీలో చేరే అంశంపై ఈటల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదు. పార్టీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ ఆహ్వానంపై ఇంతవరకూ ఆయన స్పందించ లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదని ఈటెలకు బాగా తెలుసు. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మరోవైపు గంగుల కమలాకర్ సవాల్ వినరుతున్నారు. అయితే దీనిపై త్వరలోనే స్పందిస్తానని గతంలోనే చెప్పారు. ఇప్పుడు గంగుల సవాళ్లకు సమాధానం ఇచ్చేంత స్థాయికి ఈటెల దిగజారలేదు. మరోవైపు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రాజీనామాతో హుజూరాబాదు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్ఎస్ కు సవాల్ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో అన్నది తెలియదు. ఇప్పటి వరకు ఎవరికి వారు ఊహగానాలు ప్రచురిస్తున్నారు. రానున్న కాలంలో ఈటెల ప్రభావం ఉంటుందని మాత్రం అంచనా వేయగలం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి