రావినూతల గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు
- సిఐటియూ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్
బోనకల్, జూలై 23(జనవిజయం):
మండల పరిధిలోని రావినూతల గ్రామంలో రైతు వేదిక నందు ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో సిఎస్సి(కామన్ సర్వీస్ సెంటర్) హెల్త్ కేర్ ఖమ్మం వారు హెల్త్ క్యాంపు ని ప్రారంభించారు. లేబర్ కార్డు కలిగి ఉండి 18 నుండి 60 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారికి బిపి ,షుగర్, థైరాయిడ్, సిబిపి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్), క్యాన్సర్ తో పాటు దాదాపు 50 రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్ గ్రామంలోని లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకున్నారు.ఈ క్యాంపులో హెల్త్ కేర్ సిజి శ్రీనివాసరావు,డాక్టర్ సాయికిరణ్ ఎండీ,సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, సిపిఎం సిఐటియు నాయకులు గుగులోతుపంతు, కొంగర గోపి, ఎస్కే అఫ్జల్, లక్ష్మణ్, హెల్త్ క్యాంపు సిబ్బంది లేబర్ కార్డు ఉన్న కార్మికులు పాల్గొన్నారు.