జనవిజయంతెలంగాణరవాణా వ్యయాన్ని నియంత్రించేందుకు ట్రాన్స్ ఫర్ స్టేషన్‌-మంత్రి పువ్వాడ

రవాణా వ్యయాన్ని నియంత్రించేందుకు ట్రాన్స్ ఫర్ స్టేషన్‌-మంత్రి పువ్వాడ

ఖమ్మం,జూన్ 15(జనవిజయం : సమయం, రవాణా వ్యయాన్ని నియంత్రించేందుకు ట్రాన్స్ ఫర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రూ.1.32 కోట్లతో ఖమ్మం నగరం దానవాయిగూడెం డంపింగ్ యార్డులో నిర్మించిన మిని ట్రాన్స్ఫర్ స్టేషను మంగళవారం మంత్రి ప్రారంభించారు. నగరంలో ప్రతిరోజు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇంటింటి నుండి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను, ఆయా డివిజన్లకు కేటాయించబడిన ఆటోలు, ట్రాక్టర్లు మల్లెమడుగు డంపింగ్ యార్డుకు వెల్లకుండా ఇంధన ఖర్చును తగ్గించి సమాయాన్ని వృధాకాకుండా దానవాయిగూడెంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్ స్టేషనుకు తరలించనట్లయితే అక్కడే క్రంప్రెస్ చేయడంతో పాటు మల్లేమడుగు డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తద్వారా సమయం, రవాణా వ్యయంను నియంత్రించవచ్చన్నారు.

సూపర్ స్పైడరర్స్ కు వ్యాక్సినేషన్లో భాగంగా ఆటో డ్రైవర్స్, క్యాబ్, మ్యాక్స్, మినీ వ్యాన్ డ్రైవరకు జిల్లా ట్రాన్స్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని కోవిడ్ బారీన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రతిరోజు ఎంతో మంది ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడం, నిత్యవసరాల రవాణా, జరుగుతుందన్నారు. తదనుగుణంగా వీరికి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో సూపర్ స్పైడర్ను గుర్తించి ఆయా రంగాల సూపర్ స్పైడరకు 25 వేల మందికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. అనంతరం కోవిడ్ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న కోవిడ్ బాధితులకు ఎన్.ఆర్.ఐ పేరెంట్స్ అసోసియేషన్ వారు సమకూర్చిన పండ్లను గట్టయ్య సెంటర్ రోటరీ క్లబ్ నందు మంత్రి పంపిణీ చేసారు. వీధి వ్యాపారులు రోడ్డుకిరువైపుల తమ వ్యాపారాలను నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్యతో పాటు వారికి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో వారికి ప్రత్యేక మార్కెటు నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

కార్పోరేషన్ పరిధిలోని 9 వ డివిజన్ రోటరి నగర్ లో రూ. 37 లక్షలతో నిర్మించనున్న వీధివ్యాపారుల మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రి మంగళవారం శంఖుస్థాపన చేశారు. ఇప్పటికే నూతన బస్టాండ్ ప్రాంతంలో సువిశాలమైన ప్రాంతంలో వీధివ్యాపారులకు షాపులను కేటాయించడం జరిగిందన్నారు. వారి సంక్షేమం కోసం కోవిడ్ నేపథ్యంలో వీధీ వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక చేయూతనందించడం జరిగిందన్నారు.ఖమ్మం-బోనకల్ రోడ్డుకు ధంసలాపురం వద్ద రైల్వేలైన్ పై వంతెన నిర్మాణం పనుల్లో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మెయిన్ రోడ్ కు అనుసంధానం చేయడం, రోడ్లను అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరం ధంసలాపురం నందు రవాణాకు అంతరాయం లేకుండా రూ. 16.94 కోట్లతో నిర్మించనున్న ధంసలాపురం -బోనకల్ రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణపు పనులకు మంత్రి శంఖుస్థాపన చేసారు.కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ షేక్. ఫాతిమా జోహరా, సగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా||మాలతీ, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్‌రావు, కార్పోరేటర్లు కమర్తపు మురళి, పగడాల శ్రీవిద్య, కర్నాటి కృష్ణ, హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి