జనవిజయంజాతీయంరాష్ట్రాలకు 20 కోట్ల ఉచిత టీకా డోసులు

రాష్ట్రాలకు 20 కోట్ల ఉచిత టీకా డోసులు

న్యూఢిల్లీ, మే 16 (జనవిజయం): కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఉత్పత్తి, సరఫరాను పెంచటానికి అనేక చర్యలు తీసుకుంటోంది.

మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత సరళంగా, వేగంగా అమలు చేయటం మే 1న మొదలైంది. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన 50% టీకా మందును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రాష్ట్రాలు మిగిలిన 50% నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది.

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు దాదాపు 20 కోట్లకు పైగా (20,28,09,250) కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 14వ తేదీ వరకు 18,43,67,772 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రాల దగ్గర ఇంకా 1.84 కోట్లకు పైగా (1,84,41,478) టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల లోటు కనబడుతున్నప్పటికీ అది ఎక్కువ వాడకం లేదా వృధాను చూపుతోంది. సాయుధ దళాలకిచ్చిన టీకాల సంఖ్యను సమన్వయం చేసుకోకపోవటం కూడా కనిపించింది. పైగా, మరో 51 లక్షల (50,95,640) టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపబోతోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి