రంగంలోకి NDRF బృందం
- NDRF తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ
- పలువురిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఖమ్మం, జులై 27 (జనవిజయం):
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల మేరకు NDRF బృందం రంగంలోకి దిగింది. ఖమ్మం నగరంలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF సిబ్బంది తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉదృతి ని మంత్రి పువ్వాడ జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ గారితో కలిసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయగా పలు ప్రాంతాల్లో NDRF సిబ్బందితో బోట్ లో ఇంటింటికీ వెళ్ళి క్షుణ్ణంగా వెతుకుతూ మైక్ ద్వారా వరదలో మునిగిన ఇంటి ముందు పిలుస్తూ.. ఇంకా ఇళ్ళల్లో చిక్కుకున్న వారికి రక్షించారు.