Saturday, February 24, 2024
Homeరాజకీయంరామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరి ఆకాంక్ష

రామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరి ఆకాంక్ష

  • ప్రతి తరలోనూ పోరాడుతూనే ఉన్నాం
  • సుప్రీం తీర్పు..అయోధ్య నిర్మాణంలో కల సాకారం
  • జనవరి 22 వేల సంవత్సారాల పాటు చరిత్రలో నిలుస్తుంది
  • రాముడు లేని దేశాన్ని ఊహించుకోలేము
  • పార్లమెంట్‌లో అయోధ్యపై చర్చలో అమిత్‌ షా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10:

అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని, కోట్లాదిమంది భారతీయుల కల అని హోంమత్రి అమిత్‌ షా అన్నారు.  బాలక్‌ రామ్‌ ప్రాణప్రతిష్ఠ వేడుకలపై లోక్‌సభలో శనివారం చర్చ చేపట్టారు. ఈసందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ శ్రీరాముడు లేని భారత్‌ను ఊహించుకోలేమన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై ఇవాళ లోక్‌సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఆ చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడారు.

విష్ణు సంప్రదాయం ప్రకారమే ప్రధాని మోదీ అయోధ్య రామ ప్రతిష్టలో పాల్గొన్నట్లు మంత్రి వెల్లడిరచారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాసం పాటించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడిరచారు. విభిన్న భాషల్లో ఆయన రామభజన చేశారని, ఆ సమయంలో దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారని, కానీ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదని అమిత్‌ షా తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో జైశ్రీరామ్‌ అని నినాదాలు చేశామని, ఇప్పుడు ఆలయాన్ని పూర్తిగా నిర్మించామని, అందుకే ఇప్పుడు జై సియా రామ్‌ అనాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఈ భక్తి యాత్ర సాగిందన్నారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత దేశంలో అల్లర్లు జరుగుతాయని చాలా మంది టెన్షన్‌కు గురయ్యారని, ఆలయం నిర్మాణ సమయంలోనూ ఇలాగే ఆలోచించారని, కానీ మోదీ సర్కార్‌ చాలా శాంతియుతంగా ఆ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ఇచ్చిన తీర్పును మనం గౌరవిం చాలన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం హిందూ సమాజం చాన్నాళ్లు పోరాడిందన్నారు.

కేవలం రామమందిరాన్నే కాదు, రామ సేతను కూడా ప్రధాని మోదీ నిర్మించారన్నారు. సుమారు 330 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రామ్‌లల్లా చివరకు తన నివాస స్థానానికి చేరినట్లు షా పేర్కొన్నారు. ప్రతి మతం, ప్రతి భాషలో రామాయణం ఉందన్నారు. షేక్‌ సదుల్లా మాష్‌కు చెందిన రామయన్‌ యే మాషి కూడా ఉందన్నారు. రాముడు లేదా రామచరిత్ర లేకుండా ఈ దేశాన్ని ఊహించలేమని షా అన్నారు. జనవరి 22వ తేదీ భవిష్యత్తు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రామమందిర ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. ఐదు శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెర పడింది. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పింది. దేశం కలలుగన్న అయోధ్య ఆలయం మోదీ  ప్రభుత్వ హయాంలో సాకారమైంది. అని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ నవ భారత ప్రయాణానికి నాంది. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదు.  కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ వారు ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదని అమిత్‌ షా అన్నారు. అయోధ్యలో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని చాలా ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు. కానీ, ప్రధాని మాత్రం మహర్షి వాల్మీకి పేరును సూచించారని, సమాజంలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తారని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments