వైరా, ఆగష్టు 12 (జనవిజయం): ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత అక్క కొయ్యల అరుణ, జానకిరాములు దంపతుల ఎకైక కుమారుడు కొయ్యల రాకేష్(33) శుక్రవారం సాయంత్రం మరణించారు. మధిర విద్యుత్ కార్యాలయంలో ప్రైవేట్ బిల్ కలెక్టర్ పనిచేస్తున్న కొయ్యల రాకేష్ పై అధికారుల వేధింపుల వలన మనస్థాపం చెంది ఆగష్టు 8వ తేదీ మంగళవారం విషపూరిత పదార్థాలు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఖమ్మం ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి 11వ తేదీ శుక్రవారం సాయంత్రం మరణించారు. శనివారం మధ్యాహ్నం మధిరలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, జిల్లా కమిటీ సభ్యురాలు బీబీ, ఐద్వా వైరా మండలం కార్యదర్శి ఫేక్ షైనాబి, షేక్ ఫాతిమా, షేక్ రెహానా, షేక్ మజీద్ బీ తదితరులు అమరజీవి కోయ్యల రాకేష్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.