- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి భానుమతి
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 29 (జనవిజయం): సెప్టెంబర్ 9వ తారీఖున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు,చెక్ బౌన్స్, మనోవర్తి, మోటరు వాహన ప్రమాద కేసులు, ఇ- పెట్టి చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు బ్యాంకు ప్రిలిటిగేషన్ కేసులను రాజీమార్గం ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశం అని తెలిపారు. కోర్టులో పరిష్కారం కానీ పెండింగ్ కేసులను ఇరుపాక్షాలు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు,సమయం మరియు ఇరువురు మనసులను గెలుచుకోవచ్చని న్యాయమూర్తి అన్నారు.