జనవిజయంఆంధ్రప్రదేశ్రాజకీయ కార్యాచరణ తక్షణ అవసరం

రాజకీయ కార్యాచరణ తక్షణ అవసరం

దేశంలో రాజకీయ పార్టీలు విమర్శలు మాని సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో తెలియచేయాలి. విపక్షాలు విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలతో కలసి పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యతగా విపక్షాలను కలుపుకోవాలి. ప్రధానంగా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు విపక్షాలను కలుపుకుని పోవాలి. ఉమ్మడి కార్యాచరణతో ప్రజల కస్ఠకాలంలో దేశపౌరులంగా మనమంతా ఒక్కటే అని నిరూపించి కరోనా కట్టడిలో కలసి సాగాలి. పాలకులుగా ప్రధాని, ముఖ్యమంత్రులు కూడా ఈ కష్టకాలంలో విపక్షాలను కలుపుకుని పోవడం మంచిది.

కరోనా విషయంలో వ్యాధి నిర్దారణ పరీక్షలు గతంతో పోలిస్తే తగ్గించినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు తగ్గడం లేదు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని జనరల్‌ ఆస్పత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. దానికి తోడు గ్రావిూణ ప్రాంతాల నుండి కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. గ్రావిూణ ప్రాంతాల్లో సైతం కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాలలోని పాఠశాలలతో పాటు, అవకాశం ఉన్న అన్ని ఇతర భవనాలనూ కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాలి. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేయడం, ఔషధాలతో పాటు అవసరమైనవన్నీ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా చూసి అన్ని అస్పత్రులకూ సరఫరా జరిగేటట్టు చూడటం అవసరం. నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రావిూణ ప్రాంతాల్లో వైద్య వసతులు, ఇతర మౌలిక సౌకర్యాలు నామమాత్రమే కావడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇంతకాలం వారు పట్టణ ఆస్పత్రులపైనే ఆధారపడుతూ వచ్చారు. కరోనా సమయంలోనూ వారు పట్టణాలకే వస్తున్నారు. రెండవ విడత కరోనాను అదుపు చేయడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం, కర్ఫ్యూ అమలు చేయడం లాంటి చర్యల వల్ల కొంత అదుపులోకి వస్తున్నా కేసుల సంఖ్య ప్రభుత్వం లెక్కలకన్నా ఎక్కువగానే ఉంటోంది. అలాగే మరణాల సంఖ్య కూడా అదే పద్దతిలో ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే విధానం కాకుండా తక్షణమే స్పందించాలి. ముందుగా పారదర్శకంగా వ్యవహరించాలి. పాజిటివ్‌ కేసులు, మరణాల విషయంలో వాస్తవ సంఖ్యను వెల్లడించాలి. ఏ ప్రాంతం హాట్‌జోన్‌గా ఉందో తెలిస్తే ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించడానికి వీలవుతుంది. గ్రావిూణ ప్రాంత ప్రజానీకానికి ఈ సమాచారం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇప్పటికైనా బలోపేతం చేయాలి. యుద్ధ ప్రాతిపదిక విూద వాటిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించడంతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్‌ సౌకర్యంతో బెడ్లను అందుబాటులో ఉంచాలి. అవసరాన్ని బట్టి జిల్లా కేంద్ర ఆసుపత్రులకు రోగులను తరలించడానికి అవసరమైన రవాణా వసతిని కల్పించాలి. గ్రావిూణ పేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించడం కూడా చాలా ముఖ్యం.

స్థానిక సంస్థలకు వైరస్‌ నివారణ కృషిలో క్రీయాశీలక బాధ్యతలను అప్పగించాలి. సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు ఇతర సిబ్బందిని భాగస్వామ్యం చేయడం ద్వారా పరీక్షలు విస్తృతంగా చేయడం, రోగులను గుర్తించడం, ఐసొలేట్‌ చేసి, అవసరమైన చికిత్స చేయడం వంటి పనులు వేగంగా చేయడం సాధ్యమవుతుంది. ఇప్పటికే ఇంటింటి సర్వేతో జ్వర పీడితులను గుర్తిస్తున్నారు కనుక వ్యాక్సిన్‌ కూడా నేరుగా గ్రామాలకు చేరితే మంచిది. వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలన్న విధానం సాధ్యం కాదు కనుక నేరుగా వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళిక రూపొందించాలి. ఇతర రాష్ట్రాల్లో కరోనా కట్టడికి అవంబిస్తున్న మంచి పద్దతులను ఆమోదించడంలో తప్పులేదు. లాక్‌డౌన్‌ ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు, అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచడం, నిత్యావసర వస్తువులు అందరికీ అందేలా చూడటం వంటి బాధ్యతలను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అప్పచెప్పడం ద్వారా సత్ఫలితాలను రాబట్టవచ్చు. అలాగే గ్రామాల్లో కరోనా పేషెంట్లను గుర్తించే పనికూడా దీనివల్ల సులభం అవుతుంది.

ఏకపక్ష విధానాలను విడనాడి, ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలి. ఆసక్తి ఉన్న ప్రజాసంఘాలనూ, స్వచ్ఛంద సంస్థలను క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేయాలి. బిజెపి నేతలు చేస్తున్న విమర్శల వరంపరంపరను పక్కన పెట్టి కరోనా కట్టడికి తమవంతు సాయం చేయడంలో ముందుకు రావాలి. ఎపితో పోలిస్తే తెంగాణలోనే బిజెపిపై ఎక్కువగా విమర్శ దాడి పెరిగింది. తెంగాణలో బిజెపికి కొంత పట్టు ఉండడంతో పాటు, బిజెపికి చెందిన కిషన్‌ రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. నలుగురు ఎంపిలు ఉన్నారు. దీంతో వీరంతా వివిధ అంశాలపై టిఆర్‌ఎస్‌ను అవసరమైనప్పుడల్లా నిలదీస్తున్నారు. అయితే ఎలాంటి సాయం అందించకుండా, సక్రమంగా వ్యాక్సిన్ల పంపిణీ జరక్కుండా బిజెపి నేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. ముందుగా కేంద్రం నుంచి సాయం సంపాదించాలి. మరోవైపు కేంద్రం పెట్రో ధరలు పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న బాధిత వర్గాల వారికి నేరుగా అందే సాయం కేంద్రపథకంలో లేదన్న భావన సామాన్యుల్లో సైతం నెలకొంది. ఏ వర్గానికి నేరుగా సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. అలాగే బ్యాంకు రుణాలపై మారిటోరియం విధించినా వడ్డీ తడిసి మోపెడు అవుతోంది. దీనిపైనా పెద్దగా స్పందన కానరావడం లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న తిరుగులేని మెజారిటీ కారణంగా రాష్ట్రప్రభుత్వాలను లెక్కచేయడం లేదన్నది వాస్తవం. కేంద్రం ఈ దశలో రాష్ట్రాలను కలుపుకుని పోతూ రానున్న గడ్డు పరిస్థితులను గట్టెక్కించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తే మంచిది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి