జనవిజయంఆంధ్రప్రదేశ్రాజధాని లేని రాజ్యం - జగన్ పునరాలోచిస్తాడా?

రాజధాని లేని రాజ్యం – జగన్ పునరాలోచిస్తాడా?

  • ఎపి రాజధాని ఏదంటే ఏం చెబుతాం?
  • రాజధాని లేకుండానే గడిచిన రెండేళ్ల కాలం
  • ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది

విజయవాడ, జూన్ 1(జనవిజయం): రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సిఎం జగన్ రాజధాని అన్నది లేకుండా చేసుకున్నారు. ఉన్ని రాజధానిని నిర్మించివుంటే మంచి పేరు వచ్చేది. మూడు రాజధానులు అంటూ గడపడంతో రెండేళ్ల కాలం వృధా అయ్యింది. అలాగే చంద్రబాబు పేరు చెప్పి రాజధాని అమరావతి ఉసురు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న తీరు విమర్శల పాలైంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనను గుర్తించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇష్టపడటం లేదు. ఓదార్పు అయినా చేపట్టలేదు. ఈ రెండేళ్లలో ఆయన ప్రజల దగ్గరకు రావడానికి ఇష్టపడడం లేదు. చంద్రబాబు మీద కోపంతో రైతులపై ఆయన ద్వేషం పెంచుకుంటున్న తీరు సరికాదు. అమరావతిని కాదనడానికి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయాయి. మూడు రాజధానుల సంగతి దేవుడెరుగు, రాజధాని అమరావతికి కూడా ఉనికి లేకుండా చేసుకున్నారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత కూడ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి కల్పించారు. ఏడేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది.

ఈ దుస్థితికి తానే కారణమన్న వాస్తవాన్ని జగన్ విస్మరించి పాలన చేస్తున్నారు. మనకు బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ వంటి మహానగరాలు లేవని వ్యాఖ్యానించడం మాని అంతకు మించి అన్నట్లుగా అమరావతిని నిర్మించి ఉంటే చరిత్రలో నిలిచి పోయేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల విషయంలో ఉన్న శ్రద్ధ రాజధానిపై లేకపోవడం వల్ల ఆయన ఆలోచనలు తిన్నగా సాగడం లేదు. ఆయన చుట్టూ ఉన్న మంత్రులు, ఎంపిలు, సలహాదారులు కూడా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం లేదనడానికి రెండేళ్లుగా రాజధాని లేకుండా పోవడమే కారణంగా చెప్పొచ్చు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకు కూడా కానరావడం లేదు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకానికి కూడా పునాది రాయి వేయలేదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఎదురుచూసే వారికి అది అత్యాశగా కనిపిస్తోంది. అదేమంటే నాలుగు భవనాలు వచ్చినంత మాత్రాన అభివృద్ధి చేసినట్టు కాదని అంటూ కాలం గడిపేస్తున్నారు. అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెట్టడమే అభివృద్ధి అని చెప్పడం సరికాదు. అధికార పార్టీ నాయకులు కూడా తానా అంటే తందానా అన్నట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు.

యాభై శాతం ఓట్లతో ప్రజలు తనకు అసాధారణ అధికారం అప్పగించినందున చట్టాలు, రాజ్యాంగం తనకు అడ్డు రాకూడదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఆయన తనకు అనుకున్న రీతిలో రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. అలా అయితే ఏదో ఒక రాజధానిని చేసుకుని ముందుకు సాగితే బాగుండేది. కానీ ఎన్ని విమర్శలు వస్తున్నా తమకు ఏమీ జరగనట్టుగానే దులుపుకెళ్లి పోతున్నారు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా పాలన సాగించడం వల్ల రాజధాని లేకుండా పోయింది. కోర్టుల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ దులిపేసుకొని పోతున్నారు. చంద్రబాబుపై ఉన్న రాజకీయ కక్షతో రాజధానిని పణంగా పెట్టడం సరికాదని ఆలోచించాలి. మొత్తంగా ఇప్పుడు ఎపి రాజధాని అంటే చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం విశాఖను ప్రకటించి అక్కడి నుంచే పాలన సాగించినా కొంత పురోగమనం కనిపించేది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లో ఎపి రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితికి తీసుకుని వెళ్లిన ఘనత సిఎం జగన్ దే అనడంలో సందేహం లేదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి