జనవిజయంజాతీయంకంటి తుడుపు మద్దతు ధరలతో రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

కంటి తుడుపు మద్దతు ధరలతో రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

  • ఉత్పత్తి ఖర్చులు కూడా రాక రైతులు దివాళా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
  • నున్నా నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి

ఖమ్మం, జూన్ 10(జనవిజయం): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బుధవారంనా డు పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏ మాత్రం సహేతుకంగా లేవని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రు.2,758/-, పత్తికి రు. 9,954/- ఉత్పత్తి వ్యయం అయితే కేంద్రం వరికి రు.1,964/-, పత్తికి రు.6,025/- ప్రకటించిందని, ఈ మద్దతు ధరలు రైతులను లాభదాయకంగా మారుస్తాయా? అప్పుల ఊబిలోకి ఈడుస్తాయా? అని ప్రశ్నించారు. ఈ కంటి తుడుపు ధరలు కూడా ఆచరణలో అమలు కావనేది అందరికి తెలిసిందేనన్నారు. కేంద్రం ప్రకటించిన ధరలతో రైతులు వరికి క్వింటాకు సుమారు 800 రూ.లు, పత్తికి 3,929 రూ.లు నష్టపోతున్నారని తెలిపారు. దేశవ్యాపితంగా ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకొని స్వామినాథన్ చెప్పినట్లు 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర ఇస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించుకోవటం సిగ్గుచేటన్నారు. రైతులను దగా చేసే ప్రకటనలను రైతులు నమ్మబోరన్నారు. ఉత్పత్తి ఖర్చులే యివ్వలేని వారు గిట్టుబాటు ధర యిస్తున్నట్లు చెప్పటం మోసపూరితం అన్నారు. గత యేడాదితో పోలిస్తే ఒక్క డీజిల్ పైన పెంచిన ధరల వలన ఎకరాకు 1,600 రూ.లు అదనపు భారం పడుతోందని, 72 రూ.లు క్వింటాల్ కు పెంచటం వ్యవసాయాన్ని నాశనం చేయటానికేనన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కనీసం ఉత్పత్తి ఖర్చులు రాబట్టటానికైనా కేంద్రం పై పోరాడాలన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి