జనవిజయంఆంధ్రప్రదేశ్రైతులను దోచేస్తున్న మిల్లర్లు

రైతులను దోచేస్తున్న మిల్లర్లు

  • ధాన్యం సేకరణలో మిల్లర్ల చేతివాటం
  • సంచికి పదికిలోల చొప్పున తరుగు
  • మోసపోతున్నా చెప్పుకోలేక పోతున్న అన్నదాత

అమరావతి,జూన్ 8(జనవిజయం): ఏటా ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులను కష్టాలకు గురి చేస్తోంది. వానాకాలం నాటికి సేకరణ పూర్తి కాకపోవడంతో అనేకచోట్ల ధాన్యం తడిసి ముద్దవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 21.75 లక్షల హెక్టార్లలో రబీ ధాన్యం సాగైంది. దీని నుంచి సుమారుగా 41 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రైతుల నుండి ధాన్యం సేకరించే పనిని నిర్వహిస్తోంది. దీనికితోడు మద్దతు ధరలు దక్కడం లేదు. ఓ పక్క కళ్లాల్లో ధాన్యం రాశులు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాల భయం, మరోపక్క దొంగల భయంతో రైతులు ధాన్యానికి కాపలా కాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదనుగా భావించిన పిపిసి అధికారులు రైతుల దృష్టిని మిల్లర్లవైపు మళ్లిస్తున్నారు. గోనె సంచులు ఇవ్వాలంటే క్వింటాకు 10 కేజీలు తగ్గించుకోవాలనే షరతు రైతులకు విధిస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో క్వింటాకు 10 కేజీలు చొప్పున నష్టపోయి సంచులు తెచ్చుకుని ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్న విషయాన్ని రైతులు బయటకు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాలని, తక్కువ ధరలకు అమ్ముకోవద్దని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద జరుగుతున్న తంతు ప్రకటనలకు భిన్నంగా ఉంది. రైతుల కష్టార్జితాన్ని దోచుకునేందుకు పిపిసి అధికారులు, మిల్లర్లు ఉన్నతాధికారుల కళ్లుకప్పి హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. మిల్లర్లు, పిపిసి అధికారులు ముందస్తు ఒప్పందాలతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద తూకం తగ్గించి కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు రికార్డుల్లో నమోదు చేసేందుకు పిపిసి అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారు. మిల్లర్లు ఇచ్చిన పత్రాలతో రైతు పిపిసి ద్వారా మద్దతు ధరకే ధాన్యం అమ్ముకున్నట్లు పిపిసి అధికారి వెబ్ సైట్లో రికార్డులు నమోదు చేస్తున్నారు. దీంతో రైతు మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడని నమ్మిస్తున్నారు. ఇక మిల్లరు 100 క్వింటాలు ధాన్యం తీసుకెళ్లి 90 క్వింటాళ్లే తనకు అందిందని లెక్కలేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఖర్చు తప్పడం లేదు, రైతుకు నష్టం తప్పడం లేదు. అంతిమంగా రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వాస్తవంగా రైతు ధాన్యాన్ని గ్రామ వ్యవసాయ సహాయకులు, పిపిసి అధికారులు దగ్గరుండి తూకం వేయించి, మిల్లుకు లోడు పంపాలి. మిల్లర్లు ఇచ్చే తప్పుడు రికార్డులు పిపిసి అధికారుల ద్వారా వైబ్ సైట్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర అందుతుందని, కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కానీ రైతు 10 క్వింటాళ్లు ధాన్యంపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాడు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి