జనవిజయంతెలంగాణరైతు సమస్యలు పరిష్కరించాలి - తెలంగాణ రైతు సంఘం డిమాండ్

రైతు సమస్యలు పరిష్కరించాలి – తెలంగాణ రైతు సంఘం డిమాండ్

బోనకల్,జూన్11(జనవిజయం) : ఖరీఫ్ సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాంగ్ చేస్తూ రైతుసంఘం ఆధ్వర్యంలో బోనకల్ వ్యవసాయాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఖరీఫ్ ప్రారంభమైనా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రణాళికా రూపొందించలేదని, రైతులు అనేక సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన లక్ష రుణాన్ని ఒకే సారి మాఫీ చేయాలని కోరారు. ప్రత్తి, మిర్చి పంటలకు సంబంధించి నకిలీ విత్తనాలను అరికట్టాలని, స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకుల ద్వారా కొత్త రుణాలను అందించాలని, కౌలు రైతులకు రుణ గ్రహీత పత్రాలు ఇవ్వాలని, రైతు భీమాను 18 నుండి 75 సంవత్సరాల వరకు వర్తింపచేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, లక్ష్మీపురం సహకార సంఘం అధ్యక్షులు మాదినేని వీరభద్రం, లక్ష్మీపురం ఎం.పి.టి.సి జొన్నలగడ్డ సునిత, బోనకల్ ఎం.పి.పి కే.సౌభాగ్యం, పెద్దబీరవల్లి సహకార సంఘం అధ్యక్షులు  చింతలచెరువు కోటేశ్వరరావు, రామాపురం ఎం.పి.టి.సి ఎం.అప్పారావు, రావినూతల ఎం.పి.టి.సి కె.రాధ పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి