జనవిజయంతెలంగాణరైతు సమస్యలు పరిష్కరించాలి - సిపిఎం నేత నున్నాడిమాండ్

రైతు సమస్యలు పరిష్కరించాలి – సిపిఎం నేత నున్నాడిమాండ్

 • నకిలీ విత్తనాలు, కత్తీ ఎరువులు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలి, లైసెన్స్ లు రద్దు చేయాలి
 • రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
 • రైతుబంధు అందరికీ వర్తింపచేయాలి – ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, జూన్ 14, (జనవిజయం): ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమై, ఇప్పటికే జిల్లాలో కొన్నిచోట్ల మెట్ట పంటలు వేశారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ ప్రణాళిక, ఋణ ప్రణాళిక విడుదల చేయలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవనం వద్ద ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ధర్నా సభలో ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువుల కొరకు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, కలీ విత్తనాల బెడద కూడా తీవ్రంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని ప్రకటించారని, కానీ అందుకు తగిన విత్తనాలు మండల కేంద్రాలలో అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని కలీ వ్యాపారులు రెచ్చిపోయి తమ కలీ దందా కొనసాగిస్తున్నారని, పాలకూర నుండి పత్తి విత్తనాల వరకు కోట్ల రూపాయల్లో కలీ విత్తనాలు పట్టుబడుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయని నున్నా తెలియజేశారు. నకిలీ విత్తనాలు, కలీ ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారి లైసెన్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ఒకేసారి కాకుండా, వాయిదాలలో మాఫీ చేయడం వలన రైతులు బ్యాంకుకు బాకీ ఉండటంతో తిరిగి కొత్త రుణాలు ఇవ్వడం లేదని, ఈ 7 సం.లలో జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది రైతులు వుండగా, 3 లక్షల మందికే బ్యాంకులు రుణాలు అందుతున్నాయని, 2 లక్షలకు పైగా రైతులు ఇంతవరకు బ్యాంకు గడప తొక్కలేదని అన్నారు. కొత్త వారికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని, ఇచ్చిన అప్పులకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు జరగటం లేదన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చుకొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇప్పటి వరకు విడుదల చేయలేదని, ఒకవేళ విడుదల చేసినా, ఆ పెట్టుబడి పంటలకు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలతో రైతులకు వాస్తవ వ్యవసాయ పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘాలు వేసి, ఉత్పత్తిని శాస్త్రీయంగా లెక్కవేసి, దానికి 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించి, అమలు చేయాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ధరల నిర్ణాయక కమీషన్ వేసి కూరగాయల పంటలతో సహా, అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు లేనందున రైతుబంధు పథకం వారికి అమలు కావడం లేదని, దీనితో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి వెంటనే 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుబంధు విడుదల చేసి తమ పని అయిపోనట్లు భావిస్తూ, విపరీతంగా పెరిగిపోతున్న విత్తనాలు, ఎరువుల ధరలను అదుపు చేయకపోవడంతో ఖర్చులు పెరిగి, గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నున్నా ఆరోపించారు. సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు యివ్వాలని కోరారు. రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని నున్నా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, వై.విక్రం, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, టి.లింగయ్య, నందిపాటి మనోహర్, జబ్బార్, నాయకులు మెరుగు రమణ, నర్రా రమేష్, జమ్మి అశోక్, ఆర్.ప్రకాష్, కాంపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్ ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డిని కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ, యాసంగి పంట కొనుగోళ్ళు ఇంకా పూర్తికాలేదని, కొనుగోలు చేసిన పంటకు రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదని, కాటాలు వేసిన ధాన్యాన్ని ట్రాన్స్ పోర్ట్ చేయలేదని, ఇటీవల కురిసిన వర్షాలకు కళ్ళల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఈ క్రింది డిమాండ్లతో సిపిఎం ఖమ్మం జిల్లా ప్రతినిధి బృందం ఈ రోజు ఇన్‌ఛార్జ్ డి.ఎ.ఓ. (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి) శ్రీ శ్రీనివాసరెడ్డిని కలిసి మెమోరాండం అందజేసింది. ప్రతినిధి బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, టి.లింగయ్య తదితరులు వున్నారు.

డిమాండ్స్:

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
 • అన్ని మండల కేంద్రాల్లో అవసరమైనన్ని నాణ్యమైన విత్తనాలను మార్కెట్ కమిటీల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా అందించాలి.
 • 5 ఎకరాల్లోపు రైతులకు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
 • రుణమాఫీ పథకం ఒకే మొత్తంలో ప్రభుత్వం చెల్లించటం కానీ, రైతుల అప్పులను తన ఖాతాలో వేసుకొని రైతులను రుణ విముక్తులను చేయటం కానీ చేయాలి.
 • రైతులందరికీ కొత్త అప్పులు జూన్ 15 లోపు ఇవ్వాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు చేయాలి.
 • తగినన్ని ఎరువులు మండల కేంద్రాల్లో నిల్వ ఉంచాలి.
 • 5 ఎకరాల్లోపు రైతులకు ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలి.
 • నకిలీ ఎరువులు, పురుగు మందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
 • సన్న, చిన్నకారు రైతులు చిన్న వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయడానికి 60% సబ్సిడీపై ఇవ్వాలి.
 • ఎస్సీ, ఎస్టీలకు 90% సబ్సిడీపై ఇవ్వాలి.
 • రైతుబంధు కింద రైతులందరికీ నిధులు పంపిణీ చేయాలి. ఇప్పటికే చాలా మంది రైతులకు రైతుబంధు వర్తించటం లేదు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి