జనవిజయంతెలంగాణరైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి - బషీరుద్దీన్ డిమాండ్

రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి – బషీరుద్దీన్ డిమాండ్

 -డి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ 
ఖమ్మం,జూన్ 3(జనవిజయం): రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎప్.ఐ) ఖమ్మం జిల్లా కమిటి కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఆలిండియా కమిటి పిలుపులో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఖాళీ పోస్ట్ భర్తీ చేయాలని, పోస్ట్ ల ఎత్తివేత కు నిరసనగా ప్లే కార్స్డ్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ప్రదాని మోడి  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మాట తప్పటమే కాకుండా ఉన్న ఉద్యోగాలు పికెస్తున్నాడని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రవైట్ పరం చేస్తు భవిష్యత్తులో అసలు ఉద్యోగాలులేకుండా చేస్తున్నారని దానిలో భాగంగానే రైల్వే లాంటి పెద్ద శాఖ ను కూడా ప్రవైట్ వారికి ఇచ్చేందుకు సిద్దం అయ్యాడని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా డి.వై.ఎఫ్.ఐ ఆలిండియా కమిటి పిలుపులో భాగంగా స్థానిక సుందరయ్య భవనం దగ్గర నిరసనగా ప్లే కార్స్డ్ ప్రదర్శన చేయడం జరిగిందని బషీర్ తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో  డి.వై.ఎఫ్.ఐ జిల్లా నాయకులు భూక్యా ఉపేందర్ నాయక్, సత్తెనపల్లి నరేష్, సారంగి పాపారావు, కనపర్తి గిరి, కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, యాటా రాజేష్, సాంభ, ఆర్ ప్రకాష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి