జనవిజయంసాహిత్యంరచయితలకు అధ్యయనం, పరిశీలన అవసరం

రచయితలకు అధ్యయనం, పరిశీలన అవసరం

– తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
– అక్షరాల తోవ ఆధ్వర్యంలో సాహిత్యం-సమకాలీనత’పై సెమినార్
– ప్రారంభించిన ప్రముఖ కవి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి

ఖమ్మంకల్చరల్, జూన్ 18 : ప్రతి రచయితకూ, కవికి అధ్యయనం, పరిశీలన అవసరమని ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి పేర్కొన్నారు. ఖమ్మంలోని అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ వేదికగా గురువారం రాత్రి ’సాహిత్యం-సమకాలీనత’ అనే అంశంపై సెమినార్ జరిగింది. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్, ప్రముఖ రచయిత, కవి ఏనుగు నర్సింహారెడ్డి ప్రారంభించిన ఈ సెమినార్లో ఆనందాచారి ప్రధాన వక్తగా ప్రసంగించారు. కవులకు సమకాలీన అంశాలపై అవగాహన ఉండాలన్నారు. పరిశీలనా దృష్టి లేకపోతే సమకాలీనతను ప్రతిబింబించదని అన్నారు. రచయితకు ప్రాపంచిక దృక్పథం ఉండాలన్నారు. వాస్తవాలు తెలుసుకుని రాయాలన్నారు. ఒక వ్యక్తి గురించి కాకుండా ఆ వ్యక్తికి పోటీగా ఉన్నదెవరో పోల్చుకుని చూసి కవిత్వం రాయాలన్నారు. ప్రాచీన, ఆధునిక రచనలను అధ్యయనం చేస్తేనే వర్తమానాన్ని అర్థం చేసుకోగలుగుతామన్నారు. గతాన్ని, వర్త మానాన్ని అవగాహన చేసుకున్న వారే భవిష్యత్తును చూడగలరని పేర్కొన్నారు. రచనలకు బలాన్ని ఇచ్చేది ఈ అంశమేనని తెలిపారు. సమకాలీన వస్తువు, సంఘటన, దృశ్యం కవిత్వంలో ఉన్నప్పుడు పాఠకుడిని చదివింపచేస్తుందన్నారు. అలా రచనలో పాఠకుడు కనబడాలన్నారు. ప్రజల భాషతోనే కవిత్వం రాయాలన్నారు. సమాజ అవగాహన, పరిశీలన, సమకాలీన విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. అప్పుడే సాహిత్య ప్రయోజం నెరవేరుతుందన్నారు. ప్రకృతిలో ఘర్షణ ఉంటుందని, వైరుధ్యాలే ఇందుకు కారణమని అన్నారు. ఘర్షణ లేకుండా అభివృద్ధి లేదన్నారు. ఎక్కడ ఘర్షణ ఉందో, ఎవరెవరి మధ్య వైరుధ్యం ఉందో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. సమకాలీన అంశాల పట్ల కవిత్వం ఉంటేనే రచయిత ప్రజల మన్ననలు పొందగలుగుతారని అన్నారు. ఈ సెమినార్లో అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, ప్రముఖ కవయిత్రి వురిమళ్ల సుసంద, ఖమ్మంలోని ప్రముఖ కవులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి