Saturday, February 24, 2024
Homeరాజకీయంపివికి భారతరత్న రావడం తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

  • సిఎం రేవంత్‌, మాజీ సి.ఎం కేసీయార్ లతో పాటు పలువురు హర్షం

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనవిజయం):

తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణబిడ్డ, మాజీప్రధాని ఆర్థిక మేధావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిది అని అన్నారు.  పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, ఎల్‌ కేఅద్వానీ, కర్పూరీ ఠాకూర్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించడం సంతోషకరమన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. పీవీ నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరపున రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పీవీకి భారతరత్న దక్కడం పట్ల డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుప్పకూలబోతున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్‌ ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరల పునాదుల ఫలితంగానే ఇవాళ భారత్‌ దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు.గొప్ప రాజనీతిజ్ణుడు, బహుభాషా కోవిదుదు తెలంగాణ రాష్టానికి చెందిన పీవీకి భారత రత్న దక్కడం .. కాంగ్రెస్‌ పార్టీకి, తెలంగాణ రాష్టాన్రికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. మా పోరాటాన్ని సుదీర్థక కాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని భట్టి అన్నారు.

పీవీకి భారత రత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పురస్కారం ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావుకు భారతరత్న ప్రకటించడం పట్ల కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్‌ ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల ఎక్స్‌ వేదికగా కేసీఆర్‌ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో షంతోషాన్ని కలిగించిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. యావత్‌ తెలంగాణ గర్వించదగ్గ విషయమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తన (ఎక్స్‌) ఖాతాలో పేర్కొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, బహుభాషా కోవిదుడని, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి అని ఆయన కొనియాడారు. స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చిందని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని, ఏడాదిపాటు పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారి డిమాండ్‌ చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా పీవీని బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ’తెలంగాణ ముద్దు బిడ్డ’ అని కొనియాడారని హరీశ్‌రావు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ను గౌరవించి పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ’భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోకరమైన విషయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక  (ఎక్స్‌) ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో గతంలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించామని, అప్పటి నుంచే తాము పీవీకి భారతరత్న పురస్కారం ప్రటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. అదేవిధంగా.. పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది జూన్‌లో పెట్టిన ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వండపట్ల దేశమంతా హర్షిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి స్వాగతించారు. ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అరుదైన గౌరవం దక్కిందని మాజీ ఐఎఎస్‌ కెవి రమణాచారి హర్షం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆలస్యంగా అయినా ఆయన సేవలను కేంద్రం గుర్తించిందని, అందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం గర్వంగా ఉందిన కేంద్రమాజీమంత్రి ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. పివిని భారతరత్న వరించడం తెలంగాణకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments