Saturday, February 24, 2024
Homeరాజకీయంభారతరత్నం మన పివి

భారతరత్నం మన పివి

  • పివి,చరణ్‌సింగ్‌,స్వామినాథన్‌లకు భారతరత్న
  • ఇప్పటికే కర్పూరీ ఠాకూర్‌, అద్వానీలకు ప్రకటన
  • ఈ యేడాది ఏకంగా ఐదుగురికి భారతరత్న
  • పివి దార్శనికతను కొనియాడిన ప్రధాని మోడీ

న్యూఢల్లీ,ఫిబ్రవరి9(జనవిజయం):

దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి..ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా చేసిన భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌లకు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఇటీవలే.. ఎల్‌ కే అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది. సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం. ఈరంతా ఉద్దండులే కావడం విశేషం.

చౌదరి చరణ్‌ సింగ్‌ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు జూన్‌ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు దేశ ప్రధానమంత్రులుగా సేవలు అందించారు. ఇక హరితవిప్లవ పితామహుడైన ఎంఎస్‌ స్వామినాథన్‌ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ’ఎక్స్‌ ( ట్విటర్‌)’ వేదికగా వెల్లడిరచారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ’భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, శాస్త్రవేత్త స్వామినాథన్‌ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్‌ సింగ్‌ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్‌ సింగ్‌ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయి. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టం అని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది.

నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశానికి చేసిన విశేష కృషికి గానూ భారతరత్న ఇవ్వడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సంక్షేమానికి వ్యవసాయం, రైతులు మూలస్తంభాలు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వ్యవసాయంలో తీసుకువచ్చిన మార్పులు పెనుమార్పులు తీసుకువచ్చాయి. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన ముందుచూపు వ్యవసాయ రూపరేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హావిూ ఇచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments