ఖమ్మం, ఆగష్టు 11 (జనవిజయం): ఖమ్మం నగరాభివృద్ది పనుల పరిశీలనలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖమ్మం నగరం సర్దార్ పటేల్ స్టేడియం నందు వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.
మిని వాకింగ్ ట్రాక్, పెద్ద వాకింగ్ ట్రాక్ పై నడిచి పలువురుతో మాట్లాడారు. జిమ్నాజియం, స్కేటింగ్, షటిల్, వాలిబాల్ ఇతర క్రీడా ప్రాంగణాల వద్ద ఆయా క్రీడాకారులను కలిసి వారి సాధన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని క్రీడలకు స్టేడియంను అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని, క్రీడా ప్రాంగణాలను సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.
అక్కడక్కడ పేరుకుపోయిన చెత్త ను గమనించిన మంత్రి ఆయా చెత్త, ఇతర వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరిని ఆదేశించారు.
మినీ వాకింగ్ ట్రాక్ పై వర్షాలకు ఏర్పడిన గుంతలను తక్షణమే పొడ్చాలని, గ్రీనరిని మరింత పెంచాలని సూచించారు.
మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిఈ రంగా రావు, సిటిసి ప్రిన్సిపల్ సుభాష్ చంద్ర బోస్, నూతాలపాటి నాగేశ్వర రావు, పైడిపల్లి సత్యనారాయణ, అంజిరెడ్డి, సిరిపురపు సుదర్శన్ రావు తదితరులు ఉన్నారు.