▪️చర్లలోని పునరావాస కేంద్రంకు వెళ్లి బాధితులతో మాట్లాడిన పువ్వాడ
ఖమ్మం, జులై 29 (జనవిజయం): ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి చుట్టుపక్కల పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఅర్ గారి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వం ఎర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఏరియల్ సర్వే భద్రాచలం నుండి చర్ల వరకున్న గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగింది. చర్ల గ్రామంలో దిగి అక్కడ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం GP పల్లి లో గల పునరావాస కేంద్రంలో బాధితులను కలిసి వారితో మాట్లాడి, అక్కడ అందుతున్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను మంత్రి పువ్వాడ నేరుగా పర్యవేక్షించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిన్నారు.