జనవిజయంతెలంగాణబివికె ఐసొలేషన్ సెంటర్‌కు 20వేలు వితరణ

బివికె ఐసొలేషన్ సెంటర్‌కు 20వేలు వితరణ

పుట్టినరోజు వేడుకను మానుకొని నున్నా స్వేచ్చ తీసుకున్న నిర్ణయం

ఖమ్మం, మే24(జనవిజయం) : ఖమ్మం బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో నిర్వహించడుతున్న కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌కు నగరానికి చెందిన నున్నా స్వేచ్ఛ తన పుట్టిన రోజు వేడుకలను మానుకొని రూ.20,000/-లు సహాయం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి పేద ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో వారికి అండగా ఉండాలని, తన పుట్టిన రోజు వేడుకలను మానుకొని బివికెకు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. నున్నా స్వేచ్చ ప్రతి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తుందని గుర్తు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వేచ్చ తండ్రి నున్నా నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారని, తల్లి నున్నా అనుమతి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తుంది. స్వేచ్చ తమ తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ, పేద ప్రజల గురించి ఆలోచించడం తన వంతు సహకారం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు వై. విక్రమ్,జిల్లా నాయకులు బషీరుద్దీన్, ఎస్.నవీన్ రెడ్డి, బివికె నిర్వహకులు వై.శ్రీనివాసరావు, రామారావు, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి