భద్రాచలం, ఆగస్ట్ 06 (జనవిజయం): భద్రాచలం లోని సరస్వతి శిశుమందిర్ లో శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేరు. విద్యార్ధుల చదువు నిమిత్తం ట్రస్ట్ సభ్యులు నక్కా ప్రసాద్ తల్లిదండ్రులు “నక్క రామారావు, నరసింహారత్నం” జ్ఞాపకార్థం గా సుమారు 30 వేల రూపాయల విలువ గల నోటు పుస్తకాల పంపిణీ చేసారు. శ్రీ కృష్ణదేవరాయ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పిన్నింటి రాజశేఖర్, నక్క ప్రసాద్, సోమరౌతు శ్రీనివాస్, తాళ్లపూడి రాము ఈ సందర్భం గా మాట్లాడుతూ విద్యార్థులు చదువు ద్వారా ఉన్నత విలువలతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సరస్వతి శిశు మందిర్ కి మరింత మంది దాతలు ముందుకు వచ్చి పిల్లలు ఉన్నత చదువులకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, సంఘ సేవకులు, నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు.