జనవిజయంసాహిత్యంవురిమళ్ల ఫౌండేషన్ కవితల, కథల పోటీల ఫలితాలు విడుదల

వురిమళ్ల ఫౌండేషన్ కవితల, కథల పోటీల ఫలితాలు విడుదల

– డాక్టర్ దిలావర్ కు భోగోజు పురుషోత్తం – సముద్రమ్మ స్మారక పురస్కారం

ఖమ్మకల్చరల్,జులై12(జనవిజయం): వురిమళ్ల ఫౌండేషన్-అక్షరాల తోవ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల, కథల పోటీల ఫలితాలను వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు వురిమళ్ల సునంద, భోగోజు ఉపేందర్రావు ప్రకటించారు.

కథల పోటీ ఫలితాలివే..:

కీ.శే వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల పోటీల్లో ప్రథమ బహుమతి హైదరాబాద్ కి చెందిన శివప్రసాద్ రాసిన ఆడబిడ్డ అనే కథకు లభించింది. ద్వితీయ బహుమతి నిజామాబాద్ కి చెందిన బి.కళాగోపాల్ రాసిన వలసదుఃఖం కథకు లభించింది. తృతీయ బహుమతి హైదరాబాద్ కి చెందిన అత్తలూరి విజయలక్ష్మీ రాసిన గురుత్వ ఆకర్షణ కథకు లభించింది. ఇంకా ప్రోత్సాహక బహుమతులు విశాఖపట్నానికి చెందిన చొక్కర తాతారావు రాసిన మనిషికి మనిషికి మధ్య కథకు, నల్గొండకు చెందిన సాగర్ల సత్తయ్య రాసిన ఎన్నుగర్ర కథకు, తిరుపతికి చెందిన ఆర్సి కృష్ణస్వామిరాజు రాసిన నమ్మకమే నాన్న కథకు, హైదరాబాద్ కి చెందిన శైలజామిత్ర రాసిన నపుత్రికసత్య – గతిర్నాస్తి అనే కథకు, అనకాపల్లికి చెందిన జి.రంగబాబు రాసిన వార్షికోత్సవం కథకు లభించాయి. కథల పోటీకి ప్రముఖ కథా రచయిత, విమర్శకులు శ్రీకంఠస్ఫూర్తి జడ్జిగా వ్యవహరించారు.

కవితల పోటీ ఫలితాలివే..:

కీ.శే. వురిమళ్ల పద్మజ స్మారక కవితల పోటీల్లో ప్రథమ బహుమతి గుంటూరుకు చెందిన వైహెచ్ కె మోహన్ రావు రాసిన అక్షయపాత్ర ఆగ్రహిస్తే కవితకు లభించింది. ద్వితీయ బహుమతి శ్రీకాకుళానికి చెందిన సాంబమూర్తి లండ రాసిన నాలుగు రెక్కల పిట్ట కవితకు లభించింది. తృతీయ బహుమతి శ్రీకాకుళానికి చెందిన వాడపర్తి వెంకటరమణ రాసిన వంటిరి పిట్టనై కవితకు లభించింది. పోత్రాహక బహుమతులకు విశాఖపట్టణానికి చెందిన పద్మావతి రాంభక్త రాసిన వెతికిపెట్టండి కవితకు, నిజామాబాద్కు చెందిన బి. కళాగోపాల్ రాసిన ఇప్పుడు కవితకు, మిర్యాలగూడకు చెందిన ఉప్పల పద్మ రాసిన ఆరోగ్య లక్ష్మీ కవితకు లభించాయి. ఈ కవితల పోటీకి ప్రమఖ కవి, కథకులు, విమర్శకులు దాట్ల దేవదానం రాజు జడ్జిగా వ్యవహరించారు.

2021 సంవత్సరానికిగాను కీ.శే భోగోజు పురుషోత్తం-సముద్రమ్మ స్మారక సాహితీ పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ దిలావర్ ఎంపికయ్యారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి