
పుడమి అధరం పై చిరునవ్వు చూడాలి!
ఆశల చెట్టు కొమ్మలు విరిగి కూలుతుంటే…
సమస్యల వలయం విలయంలా మారిపోతుంటే…
రక్తసిక్త డేగలు రెక్కలు విప్పి రక్కుతుంటే…
గాయాలతో కుసుమాల్లా రాలిపోతుంటే…
రాజీపడే నిరాశజీవులే అడుగడుగునా కనిపిస్తుంటే..
.
చిన్న పడవలపై సముద్రమలో కలియతిరుగుతూ
ఎండిన దొక్కతో చేపలు పట్టి గుత్తేదారులు ఇచ్చే అరకొర పైకంతో జీవితాలు సాగిస్తుంటే…
సమాజపు సన్మార్గమే అక్షరపు బాధ్యత అని గుర్తుచేస్తుంటే…
గుండెల్లో నిండిన ఎరటిఆవేదన సిరాను
అక్షర రూపం దాల్చి పుడమి అధరం పై చిరునవ్వు చూడాలి.
….శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి)
చరవాణి 9347042218….