జనవిజయంతెలంగాణప్రైవేట్ ఆసుపత్రులకు ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి - నున్నా నాగేశ్వర రావు...

ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి – నున్నా నాగేశ్వర రావు డిమాండ్

  • కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు చేయడం సరైనది కాదు
  • నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, మే31(జనవిజయం) : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించాయని ఖమ్మం నగరంలో 10 ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేయడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య అందించాలని కోరారు. ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉండటం వలన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్ దొరకక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 10 ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయడం వల్ల సుమారు 300 బెడ్లును కోల్పోయే అవకాశం ఉంది అని, దీనితో ఎక్కువ మందికి వైద్యం దూరం అవుతుందని అన్నారు. కోవిడ్ వైద్య సేవలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి, ఫీజులు, పరీక్షల ధరలు నిర్ణయించాలన్నారు. అన్ని అసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనలు అమలు అవుతున్నాయా, ఫీజులు, పరీక్షల ధరల పట్టిక ఏర్పాటు చేశారా, వైద్యం ఎలా అందుతుంది అనే దానిపై ఆ కమిటీ ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. వైద్య సేవల అనుమతులు రద్దు చేయడం కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచించి, మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూడాలన్నారు. శారద కళాశాల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చి సరిపడా డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మండల కేంద్రాలలోని అన్ని పిహెచ్ సి సెంటర్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, మెడికల్ కిట్స్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని, సరిపడ డాక్టర్లను, సిబ్బందిని నియమించాలన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి