జనవిజయంఆంధ్రప్రదేశ్టీకాలను ప్రైవేటుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి - నున్నా నాగేశ్వర రావు

టీకాలను ప్రైవేటుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి – నున్నా నాగేశ్వర రావు

  • ప్రైవేటుకు వ్యాక్సిన్లు వద్దు
  • ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం చేర్చండి
  • ప్రైవేటు ఆసుపత్రుల నుండి డబ్బులు వాపస్ ఇప్పించండి

ఖమ్మం, జూన్ 9 (జనవిజయం) : కోవిషీల్డ్, కోవార్టిన్ టీకాలను ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు యివ్వాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అందరికీ టీకా ఉచితం అని ప్రకటించిన ప్రధాని మోదీ ప్రైవేటుకు అవకాశం కల్పించడం టీకా దోపిడీకి తెర తీయటమేనన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్పత్తి కంపెనీలు ప్రైవేటుకే ఎక్కువ విక్రయించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు హాస్పిటల్స్ నుండి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని వదిలి వేసిందన్నారు. ఎప్పటిలోగా యిప్పిస్తారో, వాటికి మార్గదర్శకాలేమిటో ప్రకటించాలన్నారు. 50 వేల ఆరోగ్య సిబ్బందిని నియమిస్తామని చెప్పి వారాలు గడుస్తున్నా ఆ ఊసే లేదన్నారు. అసలే చాలీ చాలని సిబ్బంది, పైగా అనేక మంది కరోనాతో విశ్రాంతిలో ఉండటంతో ఉన్న వైద్య సిబ్బందిపై పెను భారం పడుతుందని, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, యుద్ధ ప్రాతిపదికపై సిబ్బందిని నియమించాలన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి