జనవిజయంతెలంగాణప్రైవేట్ ఆసుపత్రులపై దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారు?

ప్రైవేట్ ఆసుపత్రులపై దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారు?

  • ధరల నియంత్రణ, ఫీజుల వసూళ్లపై జీవో ఎందుకు విడుదల చేయరు
  • ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి వెబ్ సైట్లో పెట్టాలి
  • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక పై స్పందించిన హైకోర్టు
  • న్యాయవాదులను అడ్డుకోవద్దంటూ డిజిపికి ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 2(జనవిజయం): ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హైకోర్టుకు తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించామన్నారు. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తామని అన్నారు. ఒక హాస్పిటల్ 17 లక్షలు బిల్ వేసింది. మేము చర్యలు తీసుకుని మాట్లాడితే 10 లక్షలు పేషంట్ వారికి రిటర్న్ చేశారు అని పేర్కొన్నారు. అయితే ప్రైవేటు హాస్పిటల్స్ లో అధిక ధరలపై ఎందుకు ప్రభుత్వం నియంత్రణ చెయ్యడం లేదన్న హైకోర్టు.. ధరల నియంత్రణ కు ఇప్పుడు ఏమైనా జీవో విడుదల చేసిందా అని ప్రశ్నించింది. దాంతో మొదటి దశలో జీవో విడుదల చేశామని డిహెచ్ పేర్కొన్నారు. అయితే దానిని ఇప్పటికి అమలు చేస్తున్నారా. రెండవ దశ కరోనా సమయంలో ఎందుకు జీవో విడుదల చేయలేదు హైకోర్టు ప్రశ్నించింది. ధరల నియంత్రణ, అధిక ఫీజుల జీవో ఏర్పాటు పై మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెల్త్ డైరెక్టర్ అన్నారు. ఈ ధరల నియంత్రణ పై ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి వెబ్ సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా బుధవారం ధర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ హైకోర్టుకు తెలిపారు. కాగా ఆసుపత్రుల్లో అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటివరకు 174 ఫిర్యాదులొచ్చాయని డీహెచ్ తెలిపారు. వాటిలో 113 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులిచ్చామని, 20 ఆస్పత్రుల లైసెన్స్ లు రద్దు చేశామన్నారు. ఆ టీపీసీ టెస్టుల కోసం 6 ల్యాబ్ ఏర్పాటు చేశామని, మిగితా 8 ల్యాబ్స్ ను జూన్ 10 వరకు సిద్ధం చేస్తామని డీహెచ్ హైకోర్టుకు తెలియజేశారు. మూడో దశ కరోనా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది అనడానికి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ లైసెన్స్ రెన్యూవల్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటేనే లైసెన్లను రెన్యూవల్ చేస్తామన్నారు. ప్రభుత్వం పాశ మైలారంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారు చేస్తుందన్నారు. ఇకపోతే లాక్ డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు, క్లలు, స్టెనోలను అనుమతించాలని కోర్టు ఆదేశించింది. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని సూచించింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దని కోర్టు ఆదేశించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ మహేందర్ రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. ఐడీ కార్డు చూపినా లాయర్లను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి