Tuesday, October 3, 2023
Homeవార్తలుప్రెస్ క్లబ్ లో ఎగిరిన మువ్వన్నెల జెండా

ప్రెస్ క్లబ్ లో ఎగిరిన మువ్వన్నెల జెండా

— దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంది-

— టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

— జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు

ఖమ్మం, ఆగస్టు 15 (జనవిజయం ): దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఈ దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సాధించి పెట్టారని, అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపనకు జర్నలిస్టులు పాటుపడాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకోసం నిరంతరం కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, సహాయ కార్యదర్శి షేక్ జానీపాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, నాయకులు తిరుపతిరావు, సంతోష్, మోహన్, పానకాలరావు, పులి శ్రీను, అంతోటి శ్రీనివాస్, కృష్ణారావు, ప్రభాకర్ రెడ్డి, రమేష్, నరేష్, హుస్సేన్, రోసిరెడ్డి, గణేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సతీష్, ఆర్కే, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, పాషా, నగేష్, మురళి, యాదగిరి, నాగేశ్వరావు, ఆదామ్, స్టార్ శ్రీను, రోజా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments