ఖమ్మం, జులై 24 (జనవిజయం):
స్థానిక టీ.టీ.డీ.సి. మీటింగ్ హల్ నందు ఫైలేరియా వ్యాధి నివారణ కోసం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం పై వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గల వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.మాలతి హాజరై మాట్లాడుతూ జిల్లాలో బోదకాలు వ్యాధిని నిర్మూలించి ఫ్రీ ఫైలేరియా జిల్లాగా చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ మాత్రలు మింగించేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీని కోసం పగద్భంది ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని చెప్పారు. జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి సోకే మార్గాలు, వ్యాది నిర్మూలన కార్యక్రమం ఎలా అమలు చేసే విధానాన్ని వివరించారు. ఆగస్టు నెలలో జరిగే కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పారు.
అనంతరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష, అడిషనల్ డెరైక్టర్ నాగయ్యలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం గురించి 2సం|| పై బడిన వారందరికీ మాత్రలు మింగించి వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సైదులు, డాక్టర్ ప్రమీల, డాక్టర్ లక్ష్మీనారాయణ, సీనియర్ ఎంటమలజిస్ట్ వెంకటేశ్వరరావు, డెమో సాంబశివ రెడ్డి, వైద్యాధికారులు, సూపరవైజర్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.