అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలు వివరించాలి
- కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, జులై 27 (జనవిజయం):
కాంగ్రెస్ అధికారంలో వస్తే, ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో గ్రామాల్లో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పొంగులేటి పిలుపునిచ్చారు.
నాలుగు గంటలు పని చేస్తేనే మిషన్ కాకతీయ అంటున్నారని.. అసలు 28 వేల చెరువులు ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. అనేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లను సైతం కాంగ్రెస్ పార్టీ కట్టిందన్నారు.
2014కి ముందు, ఆ తరువాత కల్వకుంట్ల ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. లక్షల కోట్లు సంపాదించి ఉండకపోతే.. ప్రధాని పదవికి కేసీఆర్ ఖర్చు పెడతా అంటాడా? అని ప్రశ్నించారు.
పరిపాలనపై నమ్మకం ఉంటే, ఇప్పుడున్న 103 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్ ఇవ్వాలని తాను విసిరిన సవాల్‌కు ఒక్కరు కూడా నోరు మెదపలేదని గుర్తుచేశారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి కాకుండా గజ్వేల్ నుండే పోటీ చేయాలని సవాల్ విసిరారు.