జనవిజయంతెలంగాణఆధునిక పద్ధతులతో ప్రత్యామ్నయ సాగుకు మొగ్గు చూపాలి - పువ్వాడ

ఆధునిక పద్ధతులతో ప్రత్యామ్నయ సాగుకు మొగ్గు చూపాలి – పువ్వాడ

ఖమ్మం,జూన్2(జనవిజయం): జిల్లా రైతాంగం ఆధునిక వ్యవసాయ పద్దతులను అలవర్చుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని రాష్ట్ర రావాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో బుధవారం ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మండల రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట విత్తనాలను వాడడంవల్ల నేల సారవంతమవుతుందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం వల్ల రైతులకు ఖర్చు కూడా తగ్గుతుందని మంత్రి తెలిపారు. మన జిల్లాకు 20,370 క్వింటాళ్ళ జీలుగ, 2,200 క్వింటాళ్ళ జనుము, 3,440 క్వింటాళ్ళ పిల్లి పెసర విత్తనాల కేటాయింపు జరిగిందని, దీనిలో భాగంగా రఘునాధపాలెం మండలం రైతులకు 300 క్వింటాళ్ళ జీలుగు, 150 క్వింటాళ్ళ జనుము, 40 క్వింటాళ్ళ పిల్లి పెసర విత్తనాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రఘునాథపాలెం మండలం ఖమ్మం సగరపాలక సంస్తకు అతి సమీపంలో ఉందని, మండల రైతులు నిత్యం ఒకేపంట సాగుచేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుచేయాలని ప్రధానంగా కూరగాయల సాగుపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. తెలంగాణ రైతాంగం సగర్వంగా తలెత్తుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల బలోపేతం చేసారని మంత్రి తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు, ఎరువులను అందించడం ద్వారా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని మంత్రి అన్నారు. వరి విత్తనాలను వెదజల్లే పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని తద్వారా పంటసాగు విస్థీర్ణం పెరుగుతుందని మంత్రి అన్నారు. దీనిపట్ల జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖాధికారులకు మంత్రి సూచించారు. సీతారామ ప్రాజెక్టు నీళ్ళు పారకుండానే జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు జరిగిందని జిల్లా రైతులు వరితో పాటు పత్తిపంట సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఈ నెల 15 నుండి రైతుబంధు రైతుల ఖాతాలకు జమ అవుతుందని పార్ట్-బి నుండి పార్ట్-ఎకు వచ్చిన రైతులందరూ కూడా జూప్-10లోగా రైతుబంధుకు ధరఖాస్తు చేసుకున్న యెడల వారికి కూడా రైతుబంధు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, వ్యవసాయ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో పి.ఏ.సి.ఎస్ ద్వారా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని, జీలుగు, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను రైతులు వాడడం వల్ల భూములు చౌడుబారకుండా ఉంటాయని దీనితోపాటు యూరియా వాడకం తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వానాకాలం సీజన్ కు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉన్నాయని, రైతులు ఒకే పంటకు వెళ్ళకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 21634 క్వింటాళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు నిల్వ ఉన్నాయని వీటిని పి.ఏ.సి.ఎస్ ద్వారా రైతులకు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లాపరిషత్ చైర్మన్ లింగాలకమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాలకోటేశ్వరరావు, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబందు సమితి సభ్యులు మందడపు సుధాకర్, జడ్పీ.టి.సి మాళోతు ప్రియాంక, ఎం.పి.పి భూక్యా గౌరీ, సర్పంచ్ వి.విజయ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, మండల రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి