జనవిజయంఎడిట్ప్రజప్రశ్న మీదే... జవాబూ మీదే... ‘ప్రజ’- ఇది మన చర్చావేదిక!

ప్రశ్న మీదే… జవాబూ మీదే… ‘ప్రజ’- ఇది మన చర్చావేదిక!

అందరికీ నమస్కారం!

నవిజయం అంతర్జాల పత్రికలో “ప్రజ” అనే పేరుతో చర్చావేదికను ప్రారంభిస్తున్నాము. ప్రజ అంటే ప్రజలు అని అర్ధం ఉంది. ప్రజ లో మొదటి అక్షరం ప్రశ్నను , రెండో అక్షరం జవాబును సూచిస్తుంది. ప్రశ్న, జవాబుల ద్వారా ప్రజకు అంటే ప్రజలకు అవసరమైన విషయాలను చర్చించడమే ఈ శీర్షిక ఉద్దేశం. వ్యక్తిగతంగా ఇదే పేరుతో ఒక బ్లాగు నడిపి సక్సెస్ అయిన అనుభవం నాకున్నది. నావరకైతే అక్కడ పాఠకులు చాలామంది నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ వారి పేర్లు చెప్పడం లేదు. అందరూ సహకరించారనడం అబద్దం అవుతుంది. కొందరు ఆటంకాలు కల్పించినవారున్నారు. కొందరు అలిగి పోయినవారున్నారు. కొంతకాలం ఉత్సాహంగా ఉండి తరువాత మిన్నకున్నవారున్నారు. అప్పుడప్పుడు విలువైన వాదనలు చేసేవారూ ఉన్నారు.

అన్నీ విలువైన ప్రశ్నలు – వాదనలే ఉంచడం సాధ్యం కాదు. వీలయినంతగా ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ పోవడమే చేయగలమనేది నా అనుభవం ద్వారా అర్ధమయింది. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు అడిగేది ప్రజలే. జవాబులు చెప్పేదీ ప్రజలే. కనుక ఏ ఒక్క భావజాలానికో సంబంధించిన అంశాలు మాత్రమేగానీ, లేదా అన్నీ ఉన్నతమైన అంశాలే  గానీ చర్చించడం జరగడం సాధ్యం కాదని గుర్తించాలని మనవి. ఓ అంశాన్ని తెలుసుకోవాలనుకునే చిన్నపిల్లవాడైనా ఈ వేదికకు ప్రశ్నను పంపించవచ్చు. గొప్ప మేధావి అయినా పంపించవచ్చు. ప్రజలో మీకు తెలిసినమేరకు ఇంకా ఏమైనా మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనిపించిన అంశాలను తెలియజేయండి. గత అనుభవాలను, ఫలితాలను మేళవించుకుని ‘ప్రజ’ను తెలుగువారి చర్చావేదికగా తయారు చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది.

అన్ని రకాల, వివిధ స్థాయిలలోని ప్రశ్నలతో ఇక్కడ చర్చించడం జరుగుతుంది. కొందరికి కొన్ని రంగాలపైన ఉన్న ఆసక్తి మరో రంగం పై ఉండకపోవచ్చు. ఒకరికి ప్రశ్నగా అనిపించింది మరొకరికి ఇదేమి ప్రశ్న? అనిపించవచ్చు. అసలు చర్చించడం వల్ల ఏమి ప్రయోజనమని భావించేవారూ ఉండొచ్చు. నాకు తెలిసీ ఈ ప్రపంచంలో ఎవరికీ ఎప్పటికీ అన్ని విషయాలు తెలిసే అవకాశమే లేదు. ఎప్పటికప్పుడు ఎవరైనా తెలుసుకోవల్సిందే. తెలుసుకొవాలీ.. అంటే ప్రశ్నించాలి. ప్రశ్నకు జవాబు సరయినదో కాదో తేల్చుకోవాలంటే చర్చ జరగాలి. నిర్ధారించుకోవాలి. ఈ నియమం మేరకు చర్చలు ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా తమకు మాత్రమే అన్నీ తెలుసనుకోవడం.. నిజానికి అజ్ఞానం లేదా అహంకారం అవుతుంది.

మంచి చర్చలు జరపడానికి సహకరించాలని వినతి. చర్చలలో చెడ్డ లక్షణాలను వదిలేసేందుకు ప్రయత్నించండి. నా దృష్టిలో మంచి చర్చ అంటే : “ఇతరులను కించపరచకుండా తాము అనుకుంటున్నది వాదించడం. ఇతరుల వాదనలో మనకంటే మెరుగైన సమాచారం ఉంటే నేర్చుకోవడం. మనల్ని మనం మార్చుకోవడం”. చర్చలో చెడ్డ లక్షణం ఏమిటంటే : “వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తమకు నచ్చని వాదన వస్తే తట్టుకోలేక అలగడం. నూతిలో కప్పలా తమకు తెలిసినదే జ్ఞానమనుకోవడం.”

ఈ శీర్షికలో ప్రజలకు, సమాజానికీ, ప్రకృతికీ, పర్యావరణానికీ, మనిషి వికాసానికీ ఉపయోగపడే ఏ అంశాలనైనా …… రాజకీయం, వ్యాపారం, పాలన, విద్య, వైద్యం, అవినీతి……. వంటి మీకు నచ్చిన ఏ అంశంపైనైనా ప్రజల అభిప్రాయం తీసుకునేలా చర్చలు జరుగుతాయి. ఎవరైనా ఫలానా అంశంపై చర్చించాలని భావిస్తే మీ పేరు, మెయిల్ ఐ.డి లేదా ఫోన్ నంబరు తో పాటు వీలైతే మీ ఫోటో జతచేసి పంపిస్తే ఆ అంశాన్ని ప్రజ శీర్షికలో చర్చనీయాంశంగా ఉంచడం జరుగుతుంది. చర్చలో పాల్గొన దలచిన వారు డైరెక్టుగా పోస్టు క్రింద కమెంట్ చేయవచ్చు. లేదా [email protected] కు మీ అభిప్రాయాన్ని మెయిల్ చేయవచ్చు. మెయిల్ ద్వారా వచ్చిన అభిప్రాయాలను పోస్టులో పబ్లిష్ చేస్తాము. కమెంట్లలో అసభ్యంగా ఉన్నవాటిని, చర్చతో సంబంధం లేని వాటినీ పబ్లిష్ చేయడం జరగదు. కమెంట్లు పబ్లిష్ చేయడానికి కొన్ని సందర్భాలలో ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ చర్చావేదికలో ఉత్సాహవంతులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సామాన్యుల నుండి మేధావుల వరకూ ఈ చర్చలో పాల్గొంటే తెలియనివారు తెలుసుకునే వీలు కలుగుతుంది. తెలిసినవారికీ ఆయా సబ్జెక్టులపై మరింత పట్టు దొరుకుతుందనీ జనవిజయం భావిస్తోంది. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు కనుక……. వీలైనంతమేరకు ప్రజలకు మేలుకలిగించే, ప్రజలను చైతన్య పరచే అంశాలను ఎన్నుకుని చర్చనీయాంశాలను పంపాలని, చర్చలలో పాల్గొనాలని మనవి. ఈ శీర్షికను విజయవంతం చేయాలని విజ్ఞప్తి.

మీలో ఎవరైనా ప్రశ్నించదలచుకున్న అంశాన్ని, మీ పేరు, వాట్సాప్ నెంబరు లేదా ఇమెయిల్ ఐడి వీలయితే మీ ఫోటోతో కలిపి పంపిస్తే ఇక్కడ ప్రశ్నగా ఉంచడం జరుగుతుంది. మీరు ప్రశ్నలు ఇతర వివరాలు పంపించాల్సిన మెయిల్ ఐ.డి : [email protected] మీ సూచనలకు – సలహాలకు సదా ఆహ్వానం ! చర్చల పట్ల ఆసక్తి ఉన్న మిత్రులందరికీ ఈ పోస్టును షేర్ చేయగలరు.

– పల్లా కొండలరావు(ఎడిటర్)

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

5 COMMENTS

    • ప్రజలకు ఉపయోగపడేలా చర్చనీయాంశాలు ఉండేలా చూస్తాము గిరిదర్ గారు.

  1. దేవాదాయ ధర్మాదాయ శాఖలో దేవాలయాలు,సత్రాలులో అనధికారికంగా పనిచేసే సిబ్బంది నుండి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు లక్షలాది రూపాయలు తీసుకుని దేవాలయాల్లో EO(గ్రేడ్1,2,3) ల నియామకాలు నియామకాలు జరిగిపోయివవి. ప్రభుత్వ రూల్స్ GO ప్రకారం దేవాలయాల్లో పనిచేసే సిబ్బందిని సీనియారిటీ ప్రకారం 20% తీసుకోవాలని, A P P S C నుండి 80% రిక్రూట్మెంట్ జరగాలి. కానీ దొడ్డిదారిన 80% APPSC నుండి 20% రెవెర్సెలో నియామకాలు జరుగుతున్నాయి. గతంలో హైకోర్టు లో PIL 83/2015 ఆర్డరును కూడా దేవాదాయ శాఖ అధికారులు లెక్కచేయలేదు. విషయం AP CID వారికి పిర్యాదు చెయ్యగా C No:523/C 2/CID/2020/1620 …పిర్యాదు పై విచరణ జరుగుతున్నది. విషయం అవకాశాలు ఉంటే చర్చిద్దాం. ప్రతిభకు ప్రాధాన్యత నిద్దాం

    • గిరిధర్ గారూ… మీ వివరాలతో ఈ ప్రశ్నను జనవిజయం మెయిల్ ఐ.డికి పంపించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి