ఖమ్మం ప్రకాష్ నగర్ డ్యాంను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, జులై 23 (జనవిజయం):
ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ చెక్ డ్యాం ను ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.
మున్నేరు ఉదృతిని పరిశీలించారు. ఎగువ నుండి వస్తున్న భారీ వరద నీరు వల్ల లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు తగు ఎర్పాటు చేయాలని, అధికారులకు అప్రమత్తం చేయాలని మేయర్ పునుకొల్లు నీరజకు సూచించారు.
లకారం ట్యాంక్ బండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం రెండు లకారం ట్యాంక్ బండ్ మధ్యలో కొనసాగుతున్న ఉండే డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.