Tuesday, October 3, 2023
Homeవార్తలుతెలంగాణలో 119 నియోజక వర్గాలలో 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తాం! ...జాతీయ అధ్యక్షులు...

తెలంగాణలో 119 నియోజక వర్గాలలో 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తాం! …జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ …

అక్టోబర్ 4 న చలో హైదరాబాద్ లక్షల మందితో బారి బహిరంగ సభ

తెలంగాణ లో 119 నియోజక వర్గాలలో 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తాం!

అక్టోబర్ 4 న చలో హైదరాబాద్ లక్షల మందితో బారి బహిరంగ సభ

…జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ 

హైదరాబాద్, 13 సెప్టెంబర్(జనవిజయం) : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ గారి నాయకత్వం లో వందలాది మంది కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ అధ్యక్షత వహించగ ముఖ్య అతిథిగా వంచిత్ బహుజన్ అఘాడి,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మాజి ఎంపి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్  పాల్గొని మాట్లాడుతు., దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో బిఅర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను మార్చి ఉన్నత వర్గాల వారికి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ.. పేద ప్రజల నుండి రైతు ఉద్యోగుల నుండి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. ఇండ్లలో ఉన్న సామగ్రి బండ్లను తీసుకెళ్ళి .. ప్రవేటు ప్రభుత్వ బ్యాంకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజన బిసి మైనార్టీ బంధు ల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తూ శాశ్వత ఉద్యోగాలు ఉపాధి చూహించకుండ ఎన్నికల లబ్ది కొరకు జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో VBA – RPI పార్టీ కార్యకర్తలను గెలిపించాలని ప్రకాష్ అంబేద్కర్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ( ప్రకాష్ అంబేద్కర్  మాట్లాడింది తెలుగులో తర్జుమా) అనేక అంశాలపై మాట్లాడుతూ.,  పోటీ చేసే అభ్యర్థులు వారి వారి బయోడేటా తన  సెల్ నంబరు కాని వాట్సాప్ కు పంపాలని.,  అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని..  జనరల్ సీట్ల లో  అధిక శాతం ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మెజార్టీ గా ఎవరు ఉంటే వారిని ప్రకటిస్తామని  అన్నారు.

         ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర అధ్యక్షులు సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జి సంబారి ప్రశాంత్ కుమార్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గాదె రజిత, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జాన్ను సాంబయ్య , మహ్మద్ రహీమ్ , మెచినేని చంద్రయ్య, గంగాధర్ జాడే ,రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్యవంశి విద్యాసాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు మధ్య సంజీవ్ రావు, గాదె రాములు, కొప్పుల రామారావు , బొమ్మేర శ్రీనివాస్, పసులేటి సత్యనారాయణ , జాడి అరుణ  తీగల శేఖర్, గవ్వల శ్రీనివాస్ , మోయ్యి వేణుగోపాల్ బూరుగు మల్లేష్, మలేజ సంతోష్ ,డి లింగన్న, తోటపల్లి పద్మ , బంగారి సాయిలు ,ఎం నిర్మల, ఏ శంకర్ , వైశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు మరియు ఆంధ్రప్రదేశ్ బైండ్ల కులస్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపుదాసు తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments