ఈ కార్యక్రమంలో తొలుత తన్నీరు జగ్గయ్య విజ్ఞాన కేంద్రంను మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. చొప్పకట్లపాలెం గ్రామంలో 60 ఏళ్ళ క్రితం నుండే శాస్త్రీయ అవగాహన కల్పించడంలో గ్రామాభివృద్ధికి కృషి చేయడంలో ఆదర్శవంతమైన జీవితం గడిపిన తన్నీరు జగ్గయ్య పేరుతో ప్రతి వారం స్టడీ సర్కిల్స్ నిర్వహించడం, అంతర్జాలంలో ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను నిర్వహించడం, స్వామి వివేకానంద జయంతి, సంక్రాంతి లను పురస్కరించుకుని ప్రతీ ఏడాది గ్రామంలో ఆటలపోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సంస్థ ద్వారా నిర్వహించబడతున్న ‘జనవిజయం’ వెబ్సైట్ ను గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు ఆవిష్కరించారు. ప్రజలను చైతన్యపరిచే అంశాలతో ప్రజాపక్షం వహించే జర్నలిజం ద్వారా వివిధ శీర్షికలను ‘జనవిజయం’లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో, మండలంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో రిపోర్టర్లను నియమించడం ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
జనవిజయం 2021 కేలెండర్ ను చిరునోముల ఎంపీటీసీ సభ్యురాలు కోటపర్తి హైమావతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ జనవిజయం కేలెండర్లను పంపిణీ చేశారు.
పల్లెప్రపంచం సర్వీసెస్ తరపున ఉపాధి కల్పనకై నిర్వహిస్తున్న బిజినెస్ ప్లాన్ ను ఖమ్మం నగరానికి చెందిన సహజ నేచురల్ ఆయిల్స్ అధినేత గుత్తా శివశంకర ప్రసాద్ ఆవిష్కరించారు. సామాన్యులకు మార్కెటింగ్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు గ్రామస్థాయి నుండి కల్పించడం శుభపరిణామమన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుండి గ్రామంలో ఆటలపోటీలు ప్రారంభిస్తున్నట్లు సంస్థ సభ్యులు బొప్పాళ్ళ అజయ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి నాడు బహుమతి ప్రధానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంకు గ్రామంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, తెలుగుదేశం పార్టీల నాయకులు సమిష్టి సహకారం అందించేందుకు ముందుకు రావడం మంచి సాంప్రదాయమన్నారు.
సభలో చిరునోముల ఎఎంపీటీసీ సభ్యురాలు కోటపర్తి హైమావతి, టీఆర్ఎస్ మండల నాయకులు తన్నీరు పుల్లారావు, చొప్పకట్లపాలెం గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు, గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొగ్గవరపు సోమయ్య, వార్డు సభ్యురాలు దారెల్లి నాగేంద్రమ్మ, సీపీఎం నాయకులు చలమల హరికిషన్ రావు, బోయనపల్లి పున్నయ్య, కిలారు సురేష్, గ్రామ తెలుగుదేశం నాయకులు ఏసుపోగు నాగేశ్వరరావు, పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు పల్లా అరవింద్, మండెపుడి నరేష్, కొండేటి అప్పారావులతో పాటు వివిధ సంఘాల నాయకులు రచ్చా మధు, కోటపర్తి శ్రీనివాసరావు, చెరకుపల్లి పరశురాములు, భట్టు గోపాలరావు, చలమల అజయ్ కుమార్, పొన్నం హర్శవర్దన్, నల్లమోతు సాయికుమార్, బండి శ్రీనివాసరావు, వజ్రాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






















గమనిక:
- WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.