Thursday, October 5, 2023
Homeవార్తలువైద్య విద్యలో పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలి : కలెక్టర్

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలి : కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 25 (జనవిజయం): వైద్యవిద్యలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు సాదించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్య విద్యార్ధులను కోరారు. శుక్రవారం స్థానిక వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులో కల్సి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్య విద్యను ఎన్నుకున్నందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కళాశాల పచ్చని చెట్లుతో ఆహ్లాదకరంగా ఉండాలని, ఖాళీగా స్థలంలో విరివిగా చెట్లు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కళాశాలలో మొత్తం 150 సీట్లున్నాయని, గత సంవత్సరం నుండి కళాశాల ప్రారంభమైందని, 149 మంది విద్యార్థులు చేరినట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. వీరిలో బాలురు 62, బాలికలు 87 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో 107 మంది విద్యార్థులకు మొదటి విడతలో సీట్లు కేటాయింపు జరిగినట్లు చెప్పారు. వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిని ఆర్ అండ్ బీ ఈఈ భీంలాను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, ఆర్ అండ్ బీ ఈఈ భీంలా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఈ మురళి, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments